సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అంతకముందు కూడా మగధీర, ఈగ, విక్రమార్కుడు వంటి సినిమాలకు కథనందించారు. ఇప్ప్పుడు తమిళంలో విజయ్ 61, హిందీలో మణికర్ణిక సినిమాలకు స్టోరీ అందించారు. బాహుబలి కంక్లూజన్ 1500 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో ఆయన ఆసక్తికర సంగతులు వెల్లడించారు. అభిమాన దర్శకుడు ఎవరిని ప్రశ్నించగా.. అందుకు ఆయన స్పందిస్తూ ” రాజమౌళి తర్వాత నాకు పూరి జగన్నాధ్ బాగా నచ్చిన దర్శకుడు” అని చెప్పారు.
అలాగే తాను ఏ సినిమా పనైనా మొదలుపెట్టేటప్పుడు షోలే సినిమా చూస్తానని, ఆ సినిమా చూసి స్ఫూర్తిని పొందుతానని వివరించారు. తనకు ఇటీవల వచ్చిన సినిమాల్లో పెళ్లి చూపులు, శతమానం భవతి, గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 సినిమాలు బాగా నచ్చాయని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.