Vijay: విజయ్ బీస్ట్ రేటింగ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో విజయ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కి ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన థియేటర్లలో విడుదలైన బీస్ట్ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. హలమితి హబిబో సాంగ్ హిట్ కావడం ఈ సాంగ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంతో బీస్ట్ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా ఫెయిలైంది.

బీస్ట్ సినిమా రిలీజైన మరుసటి రోజే కేజీఎఫ్ ఛాప్టర్2 విడుదలై సంచలన విజయం సాధించడం వల్ల కూడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. బీస్ట్ సినిమాకు తమిళంలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయని సోషల్ మీడియా, వెబ్ మీడియాలో ప్రచారం జరిగినా ఆ ప్రచారాన్ని మెజారిటీ ప్రేక్షకులు నమ్మలేదు. అయితే పది రోజుల క్రితం బీస్ట్ తెలుగు వెర్షన్ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జెమిని ఛానల్ లో ప్రసారమైంది.

తాజాగా ఈ సినిమా బార్క్ రేటింగ్ వెల్లడైంది. బీస్ట్ తెలుగు వెర్షన్ రేటింగ్ కేవలం 5.94 కావడం గమనార్హం. తొలిసారి ప్రసారమైన సమయంలోనే ఈ సినిమాకు ఇంత తక్కువ రేటింగ్ వచ్చిందంటే భవిష్యత్తులో ప్రసారమైన సమయంలో మరింత తక్కువ రేటింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై కూడా బీస్ట్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం గమనార్హం.

ప్రస్తుతం విజయ్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వారసుడు సినిమాలో నటిస్తున్నారు. 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus