కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తమిళనాడులో రజనీకాంత్ తర్వాత రజినీకాంత్ అనే స్థాయికి చేరుకున్నాడు. అతని సినిమాలను ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు అస్సలు పట్టించుకునేవారు కాదు. అయితే తుపాకీ , జిల్లా వంటి చిత్రాలు కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో విజయ్ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. కానీ అప్పట్లో విజయ్ సినిమాలకు రూ.4.5 కోట్లకి మించి మార్కెట్ ఉండేది కాదు. అయితే బిగిల్ చిత్రం తెలుగు రైట్స్ ను రూ.11 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు.
ఇప్పటి వరకు విజయ్ సినిమాలకు తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఆ చిత్రానికే..! అయితే మాస్టర్ సినిమా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకున్నప్పటికీ రూ.15 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఇక బీస్ట్ సినిమాకి రూ.11 కోట్ల బిజినెస్ జరిగింది కానీ ఫ్లాప్ టాక్ రావడంతో రూ.8 కోట్ల లోపే షేర్ ను సాధించింది ఆ చిత్రం. సో విజయ్ తెలుగు థియేట్రికల్ మార్కెట్ ఎలా చూసుకున్నా.. రూ.15 కోట్లకు కొంచెం తక్కువగానే ఉంది.
అయితే ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో చేస్తున్న వారసుడు చిత్రానికి రూ.25 కోట్లు రేటు చెబుతున్నారట. తెలుగు బయ్యర్స్ మాత్రం అంత పెట్టడానికి సిద్దంగా లేరు. అయినప్పటికీ దిల్ రాజు మాత్రం ఒత్తిడి చేస్తున్నారట. దర్శకుడు వంశీ పైడిపల్లి స్టార్ డైరెక్టర్ అతనికి మంచి మార్కెట్ ఉంది అంటూ దిల్ రాజు బయ్యర్స్ కు చెబుతున్నాడట.
ఒకవేళ వారసుడు కనుక బయ్యర్స్ కు నష్టాలు మిగిలిస్తే రాంచరణ్ – శంకర్ ల సినిమా బిజినెస్ లో అడ్జస్ట్ చేస్తాను అని దిల్ రాజు హామీ ఇచ్చారట. దిల్ రాజు అంత చెప్పిన తర్వాత బయ్యర్స్ నొ అనే ఛాన్స్ ఎక్కడ ఉంది. అందుకే అడ్వాన్స్ లు ఇచ్చి వెళ్లిపోయినట్లు టాక్.