Vikram: అప్పుడెప్పుడో ఎప్పుడో చెప్పిన సినిమా ఇప్పటికి!

విక్రమ్‌ మంచి స్వింగ్‌లో ఉన్న రోజుల్లో అనౌన్స్‌ అయిన సినిమా ‘ధృవ నక్షత్రం’. నిజానికి ఈ సినిమాను భారీతారాగణంతో తొలుత అనుకున్నారు. అయితే సినిమా అనేక మలుపులు తిరుగుతూ ఆఖరికి విక్రమ్‌ దగ్గరకు వచ్చింది. అయితే గౌతమ్‌ మేనన్‌ ఏ ముహూర్తాన ఈ సినిమా అనుకున్నారో కానీ… సినిమా ప్రారంభం, షూటింగ్, విడుదల ఇలా అన్నీ వాయిదా పడుతూనే ఉన్నాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు మంచి రోజులు వచ్చినట్లున్నాయి. అవును, మీరు అనుకుంటున్నది నిజమే. ఈ సినిమా విడుదల చేయబోతున్నారట.

‘ధృవనక్షత్రం’ సినిమాను విక్రమ్‌ దగ్గరకు రావడానికి ముందు జరిగినవి తర్వాత మాట్లాడుకుందా. విక్రమ్‌ చేతికి వచ్చాక ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాను ఐదేళ్ల క్రితం ప్రకటించారు. విక్రమ్‌ హీరోగా అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌ ఈ సినిమాకు ఓ స్పెషల్‌ వీడియో సిద్ధం చేసి సినిమాను అనౌన్స్‌ చేశారు. అయితే ఆర్థిక పరమైన కారణాలు, ఇతర కారణాల వల్ల సినిమా ఆగింది. ఈ క్రమంలో అను సినిమా నుండి తప్పుకుంది. ఆ తర్వాత ఆ స్థానంలోకి రీతూ వర్మ వచ్చింది.

ఆమెతోపాటు ఐశ్వర్య రాజేష్‌ వచ్చి చేరింది. అలా ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. సరిగ్గా అదే సమయంలో కరోనా పరిస్థితులు కమ్మేశాయి. దీంతో సినిమా సంగతే జనాలు మరచిపోయారు. విక్రమ్‌ ‘ధృవనక్షత్రం’ లాంటి ఓ సినిమా చేశాడనే విషయమే మరచిపోయేంతగా పరిస్థితి మారిపోయింది. అయితే ఇటీవల ఈ సినిమా కోసం విక్రమ్‌ డబ్బింగ్‌ చెప్పారనే టాక్‌ బయటికొచ్చింది. దీంతో ‘ధృవనక్షత్రం’ సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తారని సమాచారం.

ఇక సినిమాను విక్రమ్‌ చేయడానికి ముందు ఏం జరిగిందో చూద్దాం. ఈ సినిమా 2017లో మొదలైతే… సినిమా పనులు అక్కడికి నాలుగేళ్ల క్రితమే స్టార్ట్‌ అయ్యాయి. సూర్య, దీపిక పడుకొణె జంటగా ఈ సినిమా స్టార్ట్‌ చేయాలని గౌతమ్‌ మేనన్‌ అనుకున్నారు. కానీ తొలుత సినిమా నుండి దీపిక తప్పుకుంది. ఆ తర్వాత సూర్య వెనక్కి వెళ్లిపోయారు. దీంతో జయం రవి ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. కానీ బిజీ షెడ్యూల్స్‌ కారణంగా ఆయనా నో చెప్పేశారు. దీంతో విక్రమ్‌ దగ్గరకు సినిమా వచ్చింది.

మణిరత్నం తెరకెక్కిస్తున్న‘పొన్నియిన్ సెల్వన్‌’ వేసవిలో రావాల్సి ఉంది. అయితే ఆ సినిమాను సెప్టెంబరుకు మూవ్‌ చేయడంతో ‘ధృవ నక్షత్రం’ సినిమాను మళ్లీ ముందుకు తెచ్చాడు విక్రమ్‌. అలా ఆ సినిమాకు ఇన్నేళ్లకు మోక్షం వస్తోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus