ఈ మధ్యకాలంలో సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్ చేయడం కామన్ అయిపోయింది. ఎవరి మనోభావాలు ఎప్పుడు దెబ్బ తింటాయో తెలియదు. ఎవరు ఏ సినిమాను ఎందుకు బాయ్‌కాట్ చేస్తారో అర్ధం కావడం లేదు. బాలీవుడ్ లో ఈ సంస్కృతి బాగా ఎక్కువైంది. ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ను బాయ్‌కాట్ చేశారు. అంతకుముందు కంగనా రనౌత్ సినిమాలకు కూడా బాయ్‌కాట్ పిలుపునిచ్చారు. బాయ్‌కాట్ ఉద్యమాన్ని లెక్కచేయని ‘లైగర్’ సినిమాను కూడా బాయ్‌కాట్ చేస్తామని ఓ వర్గం బెదిరించింది.
అయితే ఆ అవసరం కూడా లేకుండా ఆ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. అది వేరే విషయమనుకోండి. అయితే ఈ బాయ్‌కాట్ విషయం గురించి మాట్లాడడానికి సినిమా వాళ్లు భయపడుతున్నారు. మనకెందుకులే అన్నట్లు ఊరుకుంటున్నారు. సైలెంట్ గా తమ సినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు. కానీ మీడియా మాత్రం బాయ్‌కాట్ ట్రెండ్ గురించి హీరోలను ప్రశ్నిస్తూనే ఉంది. ‘కోబ్రా’ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చారు హీరో విక్రమ్.
ఈ సందర్భంగా బాయ్‌కాట్ గురించి సంబంధించిన ప్రశ్నలు విక్రమ్ కి ఎదురయ్యాయి. ‘ఈ మధ్య బాయ్‌కాట్ అంటూ సినిమాలను బహిష్కరిస్తున్నారు కదా..? సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటని..?’ విక్రమ్ ను ప్రశ్నించారు. దీనికి విక్రమ్ తనకేమీ తెలియదన్నట్లు.. ‘నాకు బాయ్ తెలుగు.. గాళ్ తెలుసు.. ఈ బాయ్‌కాట్ ఎవరు..?’ అని ప్రశ్నించారు.
విక్రమ్ రియాక్షన్ ని బట్టి ఆయనకు ఈ బాయ్‌కాట్ విషయంపై మాట్లాడడం ఇష్టం లేదని అర్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. చాలా కాలంగా విక్రమ్ సరైన హిట్ కోసం చూస్తున్నారు. ‘కోబ్రా’ సినిమాపై అతడి ఆశలన్నీ. మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!