ఎనర్జీ అయిపోయిందన్నా వినకుండా చేయించారట?

‘సర్కారు వారి పాట’ కోసం హైదరాబాద్‌లో చాలా సెట్స్‌ వేశారు. సినిమా పాటల కోసం, కీలక సన్నివేశాల కోసం సెట్స్‌ రూపొందించారు. వీటిలో ఓ సెట్‌ డిఫరెంట్‌గా ఉంటుందని, రిచ్‌గా ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఆ సెట్‌ ఏంటి అనేది ఇంకా వెల్లడించలేదు. అయితే బీచ్‌ సెట్‌ అని సమాచారం. అవును ‘సర్కారు వారి పాట’ కోసం హైదరాబాద్‌లో ఓ బీచ్‌ సెట్‌ వేశారట. సినిమాలో దానికి విశాఖపట్నం బీచ్‌గా చూపిస్తారట.

సినిమాలో విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో ఒక సీక్వెన్స్‌ ఉంటుందట. దాని కోసం బీచ్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేద్దామని తొలుత అనుకున్నారట. అయితే ఏమైందో ఏమో ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట. మరేం చేశారు అనుకుంటున్నార? ఏముంది మహేష్‌బాబు కోసం ఏకంగా హైదరాబాద్‌కి విశాఖ బీచ్‌ను తీసుకొచ్చేశారు. రామోజీ ఫిలింసిటీలో సెట్‌ వేసి బీచ్‌ను రూపొందించారు. ఇక ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ‘మ మ మహేశా..’ పాట గురించి కూడా మహేష్‌బాబు మాట్లాడాడు.

ఆ పాట క్రెడిట్‌ అంతా పరశురామ్‌కే దక్కుతుందని చెప్పేశాడు మహేష్‌. తొలుత ఆ పాట ప్లేస్‌లో వేరే సాంగ్‌ ఉండేదట. కానీ ‘మ.. మ.. మహేశా’ సాంగ్‌ అయితేనే బాగుంటుంది అని మహేష్‌ను కన్విన్స్‌ చేసి మరీ ఆ పాట చేయించారట పరశురామ్‌. అప్పటికే షూటింగ్‌, డబ్బింగ్‌ అన్నీ అయిపోయాయ.ట దీంతో మహేష్‌లో నా ఎనర్జీ మొత్తం అయిపోయిందట. అలాంటి సమయంలో మహేష్‌ను ఒప్పించి మరీ ‘మ మ మహేశా’ పాట చేయించారు.

ఈ పాట కోసం పది రోజుల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌ సెట్‌ సిద్ధం చేశారు. శేఖర్‌ మాస్టర్‌ మా ఇంటికి వచ్చి మరీ ప్రాక్టీస్‌ చేయించారు. సెట్‌లోకి అడుగుపెట్టి, సాంగ్‌ విన్నాక ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తూ డ్యాన్స్‌ చేసేశా అని చెప్పారు మహేష్‌బాబు. ఇప్పటికే యూట్యూబ్‌లో చూసి దుమ్ముదులిపేస్తున్న ఫ్యాన్స్‌, పెద్ద తెర మీద పాటను చూస్తే ఏం చేస్తారో మరి.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus