Vishal: పోలీసులను ఆశ్రయించిన విశాల్‌.. ఏమైందంటే?

ప్రముఖ కథానాయకుడు విశాల్‌ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం రాత్రి ఆయన ఇటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో ఈ విషయమై విశాల్‌.. పోలీసులను ఆశ్రయించినట్లు వార్తలొస్తున్నాయి. చెన్నైలోని అన్నా న‌గ‌ర్‌లో ఉన్న తన ఇంటిపై కొంతమంది దుండగలు రాళ్ల దాడి చేసినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎరుపు రంగు కారులో వ‌చ్చిన కొంతమంది దుండ‌గులు రాళ్లు విసిరారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారట.

రాత్రిపూట రాళ్లు పడుతున్న విషయాన్ని పరిశీలించిన సిబ్బంది.. ఆ విషయం విశాల్‌ దృష్టికి తీసుకెళ్లారట. దాంతో ఇంటి సీసీ టీవీ ఫుటేజ్‌ చూడగా.. ఓ రెడ్ కల‌ర్ కారును గుర్తించారట. దీంతో ఈ విషయాన్ని విశాల్ త‌న మేనేజ‌ర్ ద్వారా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారట. విశాల్ హీరోగా, నిర్మాత‌గా తమిళనాట రాణిస్తున్నారు. అంతేకాదు న‌డిగ‌ర్ సంఘం కార్య‌ద‌ర్శిగానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓ ద‌శ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి ఆయ‌న సిద్ధ‌మ‌య్యారని టాక్‌.

విశాల్‌కు ప్రమేయమున్న అన్ని రంగాల్లోనూ.. పరిస్థితి ఏమంతా సాఫీగా లేదు. విశాల్ అంటే గిట్టనివారు చాలామంది ఉన్నారని తమిళనాట టాక్‌. దూకుడుగా ఉండే విశాల్ అంటే ప‌డ‌ని వారు చాలా మంది ఉన్నార‌నేది కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. వారిలో ఎవరో ఈ రాళ్ల దాడికి ప్రయత్నించి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. పోలీసుల విచారణలో ఈ విషయంలో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని టాక్‌. ఇది ఆకతాయిల పనా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసినదనా అనేది తెలిపోతుంది.

ఇక విశాల్‌ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో ‘సామాన్యుడు’ సినిమాతో విశాల్‌ మెప్పించాడు త్వ‌ర‌లోనే ‘లాఠీ’ అనే మరో చిత్రంతో రానున్నారు. ‘మార్క్ ఆంటోని’ అనే పీరియాడిక్ చిత్రంలోనూ న‌టించ‌బోతున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. అందులో విశాల్‌ను చాలామంది గుర్తు పట్టలేకపోయారు కూడా. ఇక విశాల్‌ సినిమాలు కోలీవుడ్‌తోపాటు తెలుగులోనూ విడుదలవుతుంటాయి. కాబట్టి ఈ సినిమాలు కూడా తెలుగులోనూ వస్తాయి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus