టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సినిమా విషయంలో…రివ్యూ రూపంలో జరుగుతున్న దాడిపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు విశాల్…అయితే విశాల్ ఏమన్నాడు…అసలు ఎందుకు విశాల్ అలా మాట్లాడాడు అంటే…కాస్త ఈ కధ చదవండి మీకే అర్ధం అవుతుంది…విషయంలోకి వెళితే…ఈ మధ్య కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రతీదీ అడ్వ్యాన్స్డ్ గా ఆలోచించడం అలవాటు అయిపోయింది…అదే విధంగా లక్షల్లో ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ వచ్చేయ్యడంతో ఈ హడావిడి మరీ ఎక్కువైపోయింది…అయితే అదే క్రమంలో దీనిపై స్పదించాడు విశాల్….ఇప్పుడున్న ప్రపంచంలో…..సినిమా రిలీజ్ కావడం ఆలస్యం దానికి సంబంధించిన రివ్యూ వెంటనే ఇస్తున్నారు. అయితే అది పాజిటీవ్ కావొచ్చు, నెగిటీవ్ కావొచ్చు సినిమాపై మాత్రం విపరీతమైన ప్రభావం పడుతుంది. అయితే ఓ కొత్త సినిమా రిలీజ్ కాగానే, లేదా రిలీజ్ కి ఒకరోజు ముందో నెగెటివ్ రివ్యూలెందుకు అని ప్రశ్నిస్తున్నాడు కోలీవుడ్ హీరో విశాల్.
దీని వల్ల లాభపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు కానీ…ఇలాంటి సమీక్షలు సినీ దర్శకులు, నిర్మాతలను చాలా బాదపడుతూ ఉంటారు అని అంటున్నాడు ఏ తమిళ హీరో….అదే క్రమంలో….ఒక్క సినిమా తెరకెక్కించాలంటే ఎన్నో కష్టాలు పడుతున్నామని..ఫైనాన్సియల్ గా ఎన్ని బాధలు ఉంటాయో రివ్యూ రాసేవారికి తెలుస్తుందా అని ప్రశ్నించాడు. సినిమా విడుదలయిన 3 రోజులవరకైనా వెయిట్ చేయలేరా..? ముఖ్యంగా కొన్ని చిన్న వెబ్ సైట్లు సినిమా విడుదల కాకముందే ఓ ఫోటో పెట్టేసి సమీక్షలు రాసేస్తున్నాయ్ అన్నాడు. మొత్తంగా చూసుకుంటే ఈ రివ్యూస్ మన తమిళ హీరోని బాగా కష్టపెట్టినట్లు ఉన్నాయి, అంతేలే ఎంతైనా హీరో కమ్ నిర్మాత కదా…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.