విశాల్ (Vishal) మీడియా ముందుకు వచ్చి చాలా రోజులైంది. గతేడాది మార్చిలో ఆఖరిసారిగా మీడియా ముందు కనిపించారు. ఆ తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో వచ్చినా ఎక్కువసేపు బయట లేరు. అయితే ఆయన పాత సినిమా ఒకటి ఫస్ట్ రిలీజ్ అవుతున్న సందర్భంగా రీసెంట్ తమిళ మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో ఆయన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఏంటిది విశాల్ ఇలా అయిపోయాడు అని అనుకుంటున్నారు. గత రెండు రోజులుగా ట్విటర్‌లో ఓ వీడియో వైరల్‌గా మారింది.
Vishal
తమిళనాట సంక్రాంతికి విడుదలవుతున్న ‘మద గజ రాజా’ సినిమా ప్రెస్ మీట్ ఇటీవల చెన్నైలో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి విశాల్ వచ్చారు. అయితే విశాల్ బక్క చిక్కిపోయి కనిపించాడు. ఇన్ని రోజులుగా ఫిట్‌గా ఉన్న విశాల్‌ని చూసిన వాళ్లు ఒక్కసారిగా ఇలాంటి లుక్‌లో చూసేసరికి ఏమైంది అని కంగారు పడ్డారు. లుక్ ఒక్కటే కాదు, మాటలు కూడా వణుకుతూ ఉన్నాయి. చేతులు అయితే మైక్ పట్టుకున్నంతసేపు షేక్ అవుతూనే ఉన్నాయి.
దీంతో అసలు విశాల్‌కి ఏమైంది అనే చర్చ మొదలైంది. విశాల్ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నాడని కొంతమంది అంటుంటే.. కాదు కాదు ఆయనకు కిడ్నీ సమస్య వచ్చింది అని కోడంబాక్కం వర్గాల సమాచారం. గత కొంతకాలంగా అనారోగ్యంతో విశాల్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. 12 ఏళ్ల నాటి సినిమా కావడం, ఆయన డిస్ట్రిబ్యూటర్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈవెంట్‌లో విశాల్ వచ్చారని చెబుతున్నారు.
ఏదేమైనా విశాల్ (Vishal) తిరిగి కోలుకొని పూర్వపు ఫిట్ స్థితిలో కమ్ బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు విశాల్ ఈ విషయంలో క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది. చూద్దాం మరి ఆయనేం చేస్తాడో. ఇక విశాల్ సినిమాల సంగతి చూస్తూ.. ‘రత్నం’ (Rathnam) సినిమాతో గతేడాది వచ్చారు. ‘డిటెక్టివ్ 2’ సినిమా పనులు ప్రీప్రొడక్షన్ స్టేజీలో ఉన్నాయి. ఆ సినిమానే ఆయనే తెరకెక్కిస్తానని చెప్పారు. అనారోగ్యం నేపథ్యంలో ఆ పనులు ఇప్పుడు హోల్డ్‌లో పెట్టారు అని సమాచారం.