Vishal, Vijay: విలన్ గా విశాల్.. డైరెక్టర్ ప్లాన్ ఇదే!

కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు లోకేష్ కనగరాజ్. ఇటీవల కమల్ హాసన్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘విక్రమ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పుడు లోకేష్.. విజయ్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదివరకు వీరిద్దరూ కలిసి ‘మాస్టర్’ అనే సినిమా చేశారు. ఈ సినిమా వందల కోట్లు రాబట్టింది. ‘మాస్టర్’ని మించిన స్క్రిప్ట్ రెడీ చేసుకున్నానని లోకేష్ చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే భారీ క్యాస్టింగ్ ను సెట్ చేసే పనిలో పడ్డారు.

ఇందులో భాగంగా విశాల్ ని ప్రతినాయకుడి పాత్ర కోసం అడిగినట్లు సమాచారం. ప్రస్తుతం విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్లిన లోకేష్.. విశాల్ తో మీటింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి మొదట పృథ్వీరాజ్ సుకుమారన్ ను విలన్ గా అనుకున్నారు. కానీ అతడి డేట్స్ ఖాళీగా లేవు. పైగా ‘సలార్’ సినిమాలో విలన్ గా చేస్తున్నారు పృథ్వీరాజ్. ఇప్పుడు మరో ప్యాన్ ఇండియా సినిమాలో విలన్ అంటే ఇబ్బంది అని..

నో చెప్పినట్లు కథనాలను ప్రసారం చేస్తున్నారు. ఇప్పుడు ఆ పాత్ర విశాల్ కి వెళ్లింది. మరి విశాల్ ఒప్పుకుంటారా..? లేదా..? అనేది ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు విశాల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేయలేదు. ఫామ్ లో ఉన్నా.. లేకపోయినా.. ఆయన హీరోనే. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలేవీ సరిగ్గా ఆడలేదు. ‘లాఠీ’ సినిమా ఫస్ట్ కాపీ రెడీగా ఉన్నా.. బిజినెస్ ఇబ్బందులతో రిలీజ్ డేట్ ని ఫైనల్ చేసుకోలేకపోతున్నారు.

ఇక ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో చాలా డిఫరెంట్ రోల్ చేస్తున్నారు విశాల్. ఇలాంటి పరిస్థితిలో విజయ్ సినిమాలో విలన్ గా నటించడానికి విశాల్ ఒప్పుకుంటారా..? లేదా..? అనేది చూడాలి. విశాల్ ని ఆన్ బోర్డ్ చేయడం ద్వారా కథకి కొత్తదనం వస్తుందని భావిస్తున్నారు లోకేష్ కనగరాజ్. మరేం జరుగుతుందో చూడాలి!

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus