Vishnu Priya: నాగార్జుననే వదల్లేదు.. విష్ణు ప్రియ..ఓ లెక్కా..!

‘అనువుగాని చోట అధికులమనరాదు’.. ఈ మాట పెద్దలు ఊరికే చెప్పలేదు. మనం ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. కాదు అని లేనిపోని గొప్పలకు వెళితే.. ఇదిగో విష్ణు ప్రియ మాదిరి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ ఏమైంది? విషయంలోకి వెళితే.. బిగ్ బాస్ 8 కి విష్ణు ప్రియ(Vishnu Priya) ఓ కంటెస్టెంట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. 10 వ కంటెస్టెంట్ గా ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

Vishnu Priya

ఇక హౌస్ లోకి వెళ్లే ముందు హోస్ట్ నాగార్జునతో (Nagarjuna) ఆమె ‘నాకు ఎంటర్టైన్మెంట్ లిమిట్ లెస్ గా కావాలి’ అంటూ తెలిపింది. ఇక్కడి వరకు చూసుకుంటే.. ‘ఇందులో తప్పేముంది?’ అని మీకు అనిపించవచ్చు. కానీ ముందు జరిగింది వేరు. గతంలో ఓ సందర్భంలో విష్ణు ప్రియని… ‘మీరు బిగ్ బాస్…లోకి ఎంట్రీ ఇస్తున్నారట.. నిజమేనా?’ అని అడగడం జరిగింది. అందుకు ఆమె సింపుల్..గా లేదు అని సమాధానం ఇస్తే సరిపోయేది.

కానీ ఆమె.. “బిగ్ బాస్ వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను హౌస్లోకి వెళ్ళను. ఎందుకంటే ప్రపంచం బయట చాలా అందంగా ఉన్నప్పుడు.. ఎందుకు ఒక్క ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళను చూసుకోవాలి. నేను బిగ్ బాస్ పర్సన్ కాదు. చిన్నప్పటి నుండి నేను ఎప్పుడూ బిగ్ బాస్ చూడలేదు. నన్ను ఎవరైనా బిగ్ బాస్ గురించి అడిగితే నేను ఎంకరేజ్ కూడా చేయను. రాసి పెట్టుకోండి.. నేను బిగ్ బాస్ కి వెళ్ళను.

ఒకవేళ వెళ్తే బదులుగా మీరు నన్ను ఎంతైనా విమర్శించొచ్చు” అంటూ అనవసరమైన కామెంట్లు చేసింది. దీంతో ఇప్పుడు విష్ణు ప్రియని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. గతంలో ఓసారి నాగార్జున కూడా బిగ్ బాస్ గురించి నెగిటివ్ కామెంట్లు చేశారు. కానీ తర్వాత ఆయనే హోస్ట్ చేయడంతో నాగార్జునని సైతం ట్రోల్ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. కాబట్టి.. విష్ణు ప్రియ (Vishnu Priya) నెటిజెన్లకి ఓ లెక్కా..!

 కాంతార ప్రీక్వెల్ ఛాన్స్ గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus