చేసే ప్రతి పాత్ర కొత్తగా ఉండేలా చూసుకునే కథానాయకులు కొంతమందే ఉంటారు. అందుకే కథలు ఎంచుకోవడంలో చాలా లెక్కలేసుకుంటారు. అలాంటి కుర్ర హీరోల్లో విశ్వక్‌సేన్ ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు చూస్తే ఈజీగా చెప్పేయొచ్చు. సినిమాల కోసం ఆయన పడే కష్టం, చేస్తున్న ఆలోచనలు, ప్రచారం చేస్తున్న పనులు ఇటీవల కాలంలో తెలిసిపోతున్నాయి. ప్రాంక్ వీడియో తీసుకొచ్చిన కష్టం మీకు తెలిసిందే.
నటుడిగా అన్ని తరహా సినిమాలూ చేయాలనేదే నా ఆలోచన. అమ్మాయిగా నటించడానికి కూడా నేను సిద్ధమే. ‘బ్రహ్మచారి’ సినిమాలో కమల్‌హాసన్ చేసిన పాత్రను చేయాలి అనుకుంటున్నాను. ఇప్పటివరకు నా ఐదు సినిమాలు ఒకెత్తు, ఇకపై వచ్చే ఐదు సినిమాలు మరో ఎత్తు అంటున్నాడు విశ్వక్‌సేన్. నా 29వ ఏట పాన్ ఇండియా చిత్రం స్టార్ట్ చేస్తాను. ‘మాస్ కా దాస్’ పేరుతో పాన్ ఇండియా చిత్రం చేస్తాను అని కూడా చెప్పారు. ఆ సినిమాకు సంబంధించి స్క్రిప్టు రాస్తున్నాను.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మేం చాలానే చేశాం. వేరే ఏవీ కనిపించడం లేదు ఒక్క ప్రాంక్ వీడియో వివాదం ఒక్కటే హైలైట్ అవుతోంది. సినిమా గురించి కాకుండా ఆ వ్యవహారం పక్కదారి పట్టినట్టైంది. ఇకపై ఆ తరహా ప్రయత్నాల జోలికి వెళ్లను అని క్లారిటీ ఇచ్చారు విశ్వక్‌సేన్. పెళ్లి గురించి ఆయన చేసిన ప్రాంక్ వీడియో వైరల్ అయ్యి, కేసులు, కంప్లైంట్‌లు, టీవీ చర్చలు, రచ్చల వరకు వెళ్లిన విషయం తెలిసిందే.
‘అశోకవనంలో అర్జున కల్యాణం’లో ఆయన పోషించిన అర్జున్‌కుమార్ అల్లం పాత్ర గురించి కూడా చెప్పాడు విశ్వక్‌సేన్. పది కిలోలు బరువు పెరిగి నటించాలని చెప్పారు దర్శకుడు. నేనేమో ఏడు కిలోలు చాలని చెప్పా. బరువు పెరగడం సమస్య కాదు, తగ్గడంలోనే సమస్య వస్తుంది కదా. అందుకే ఏడు కిలోలకే ఆపేసి నటించా. ఇక తర్వాత రాబోయే సినిమాల గురించి మాట్లాడుతూ ‘ఓరి దేవుడా’ విడుదలకి సిద్ధం ఉంది. నా దర్శకత్వంలోనే ‘ధమ్కీ’ అనే సినిమా చేస్తున్నాను. సాహిత్ దర్శకత్వంలో ‘స్టూడెంట్ జిందాబాద్’ చిత్రీకరణ నడుస్తోంది అని చెప్పారు.