Vishwak Sen: విశ్వక్ సేన్ కు ఆ దర్శకుడి పై అంత నమ్మకం ఏంటో..!

‘ఫలక్ నుమా దాస్’,’హిట్’,వంటి చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో విశ్వక్ సేన్. అయితే పాగల్’ చిత్రంతో ప్లాప్ మూటకట్టుకుని కాస్త రేసులో వెనుకపడ్డాడు. మరో రెండు చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అయితే తాజాగా మరో కొత్త సినిమాని కూడా స్టార్ట్ చేసాడు. అదే `దాస్ కా ధమ్కీ`. ఈరోజు అనగా బుధవారం నాడు రామానాయుడు స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైంది ఈ చిత్రం.విశ్వక్ సేన్ కు జోడీగా మరోసారి హీరోయిన్ నివేత పేతురాజ్ నటిస్తుంది.

Click Here To Watch Now

దీనికి కూడా రైటర్ గా ప్రసన్నకుమార్ వ్యవహరిస్తున్నాడు. దీనికి కూడా ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలినే దర్శకత్వం వహిస్తున్నాడు. కరాటే రాజు ఈ చిత్రానికి నిర్మాత. అయితే ప్లాప్ ఇచ్చినా సరే నరేష్ కు విశ్వక్ మరో ఛాన్స్ ఎలా ఇస్తున్నాడు అనే డౌట్ చాలా మందిలో ఉంది. అయితే ‘పాగల్’ చిత్రానికి క్రిటిక్స్ నుండీ బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. కానీ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయ్యాక చూసినవాళ్ళు మాత్రం ‘పాగల్’ బాగుంది అంటూ చెప్పుకొచ్చారు.

వాళ్ళ విశ్లేషణ ఏంటంటే.. ‘ ‘పాగల్’ సినిమా విషయంలో దర్శకుడు తప్పేమీ లేదు.. హీరో విశ్వక్ సేనే ప్రీ రిలీజ్ వేడుకలో ఎక్కడ లేని అతి చేయడం వల్ల సినిమా ప్లాప్ అయ్యింది అంటూ వాళ్ళు కామెంట్లు చేశారు. ‘పాగల్’ ప్రీ రిలీజ్ వేడుకలో ‘మూసుకున్న థియేటర్లను అన్నిటినీ తెరిపిస్తా, నేను అడవికి వెళ్ళి సింహంతో ఆటాడుకునే టైపు’ అంటూ భీభత్సమైన ఆటిట్యూడ్ ప్రదర్శించాడు. అందువల్లనే సినిమా ప్లాప్ అయ్యిందనేది వాళ్ళ అభిప్రాయం. మరి `దాస్ కా ధమ్కీ` తో అయినా దర్శకుడు నరేష్ ట్యాలెంట్ బయటపడుతుందేమో చూడాలి..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus