Vishwak Sen: ‘దేవర’ నా… ? లేక ‘బాలయ్య 109 ‘.. హాట్ టాపిక్ గా మారిన విశ్వక్ సేన్ కామెంట్స్..!

విశ్వక్ సేన్.. టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరో అలాగే ప్రామిసింగ్ హీరో కూడా అనొచ్చు..! కానీ మనోడు ఒక్కోసారి స్టార్ హీరోల మాదిరి ఫీలవుతూ ఉంటాడు. అదే పెద్ద ప్రాబ్లం. అతనికి ఆటిట్యూడ్ ఉంది అని పదే పదే అందరూ చెప్పుకోవాలి అని భావిస్తాడో ఏమో కానీ.. అతని ధోరణి మాత్రం అలానే ఉంటుంది. అతను కెరీర్ ప్రారంభించి 5 ఏళ్ళు కావస్తున్నా.. పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది అంటూ ఏమీ లేదు. ‘ఫలక్ నుమా దాస్’ ‘హిట్’ ‘దాస్ క ధమ్కీ’ మాత్రమే కమర్షియల్ సక్సెస్..లు అందుకున్నాయి. మిగిలినవి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బ్రేక్ ఈవెన్ అయ్యింది లేదు. అయినా సరే విశ్వక్ సేన్ స్టార్ హీరోల మాదిరి బిల్డప్ ఇస్తుంటాడు.

సరే ఇక విషయం ఏంటి అంటే.. విశ్వక్ సేన్ కి ఇటీవల ఓ పెద్ద హీరో సినిమాలో ఛాన్స్ వచ్చిందట. అది ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ చేసిన రోల్ వంటిది అని విశ్వక్ సేన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలాగే అది మంచి పాత్ర అయినా అతను నో చెప్పాడట. ఎందుకంటే అదే హీరోతో అతనికి ఇంకా మంచి సినిమా చేయాలని ఉందట. విశ్వక్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

విశ్వక్ (Vishwak Sen) చెప్పింది ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా గురించి అని అంతా అనుకుంటున్నారు. ఆ సినిమాలో సెకండ్ హీరోకి పెద్దగా ఛాన్స్ లేదు. కానీ బాలయ్య – బాబీ సినిమాలో ఇంకో యంగ్ హీరోకి సెట్ అయ్యే పాత్ర ఉంది. దాని కోసం నానిని అడిగారు. కానీ అతను నో చెప్పినట్లు టాక్ వినిపించింది. ఫైనల్ గా దుల్కర్ ఆ పాత్ర చేస్తున్నట్లు ప్రచారం నడిచింది. కానీ చిత్ర బృందం ఇంకా క్లారిటీ ఇచ్చింది లేదు. పనిలో పనిగా మధ్యలో విశ్వక్ సేన్ ని కూడా సంప్రదించి ఉండొచ్చు. ఎందుకంటే విశ్వక్ సేన్ కి బాలయ్యతో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి..!

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus