గోపీచంద్(Gopichand) , కావ్య థాపర్ (Kavya Thapar) హీరో హీరోయిన్లుగా… శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’ (Viswam). దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ‘చిత్రాలయం స్టూడియోస్’ సంస్థతో కలిసి నిర్మించారు. తొలిరోజు ‘విశ్వం’కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫామ్లో లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ నిరాశపరిచాయి.తర్వాత వీక్ డేస్ లో స్టడీగా రాణించినా బ్రేక్ ఈవెన్ కాలేదు.
Viswam Collections:
కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. ఒకసారి (Viswam) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే:
‘విశ్వం’ చిత్రానికి రూ.12.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.7.58 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓపెనింగ్స్ కనుక బాగా వచ్చి ఉంటే సినిమా చాలా వరకు గట్టెక్కేసేది. కానీ ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.5.42 కోట్ల దూరంలో అయిపోయి ప్లాప్ గా మిగిలింది.