మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శృతి హాసన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ కూడా కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి . ఇక మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా చాలా బాగా నమోదయ్యాయి.6 రోజుల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసింది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం | 24.30 cr |
సీడెడ్ | 14.15 cr |
ఉత్తరాంధ్ర | 10.08 cr |
ఈస్ట్ | 7.55 cr |
వెస్ట్ | 4.25 cr |
గుంటూరు | 5.88 cr |
కృష్ణా | 5.49 cr |
నెల్లూరు | 2.73 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 74.43 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.81 cr |
ఓవర్సీస్ | 10.50 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 90.74 cr (షేర్) |
వాల్తేరు వీరయ్య చిత్రానికి రూ.86.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.87 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.90.74 కోట్లు షేర్ ను రాబట్టి… బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా బయ్యర్స్ కు రూ.3.74 కోట్ల లాభాలను అందించింది.
అయితే సీడెడ్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు వంటి ఏరియాల బయ్యర్స్ ఇంకా సేఫ్ జోన్లోకి రావాల్సి ఉంది. ఈ వీకెండ్ కు అన్ని ఏరియాల్లో ఈ మూవీ లాభాల బాట పట్టడం ఖాయం.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?