Chiranjeevi, Balakrishna: చిరంజీవి, బాలకృష్ణల ఫ్యాన్స్ వార్ కి ఆ హీరోయిన్ వే కారణమా..!

కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్న చిరంజీవి, బాలకృష్ణ మధ్య వ్యక్తిగతంగా స్నేహసంబంధాలున్నప్పటికీ.. అభిమానుల మధ్య మాత్రం వైరం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే భోళాశంకర్ రూపంలో చిరంజీవికి భారీ డిజాస్టర్ ఎదురైంది. అయితే ఆచార్య కన్నా కొంచెం పర్వాలేదని, బానేవుంటుందని అంతా అనుకున్నారు. కానీ చివరకు ట్రోలర్స్‌కు అడ్డంగా దొరికిపోయింది.

ఈ సినిమాకు వ్యతిరేకంగా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో మెగా అభిమానులు చాలా అవమానంగా ఫీలయ్యారు. సినిమా ఫలితంకన్నా ఆ ట్రోలింగ్‌కు మెగా అభిమానులు ఎక్కువగా బాధపడ్డారు. తాజాగా వీరి దృష్టి మరోసారి బాలకృష్ణపై పడింది. కొంతమంది ఒక బృందంగా ఏర్పడి స్కంద ఈవెంట్‌ను పరిశీలించారు. బాలకృష్ణ మాట్లాడుతుండగా శ్రీలీల నవ్వు ఆపుకుంటున్నట్లుగా ఒక వీడియో వైరల్ అవుతోంది.

వాస్తవానికి భగవంత్ కేసరి సినిమావల్ల బాలయ్య, శ్రీలీల ఇద్దరూ క్లోజ్ అయ్యారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు, క్యాన్సర్ ఆసుపత్రి ఈవెంట్‌కు శ్రీలీల హాజరైంది. స్కంద ఫంక్షన్‌లో బాలకృష్ణ రామ్‌ను సరాదాగా టీజ్ చేస్తారు. అయితే అది రామ్ మీద బాలయ్య ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్లుగా వీడియో వైరలవుతోంది. అయితే అదే వేడుకలో రామ్, బాలయ్య ఇద్దరూ సరదాగా గడిపారు.

ఇలా ఇప్పుడు మెగా నందమూరి అభిమానులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఇష్టమొచ్చినట్టుగా తిట్టుకుంటున్నారు. మెగా నందమూరి ఫ్యాన్ వార్ అనేది ఇప్పటికే కాదు ఎప్పటికీ ఇలానే కొనసాగుతుందని చెప్పకనే చెబుతున్నారు ఇరువురి అభిమానులు. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద కూడా ఇలాంటి వాగ్వాదం, వివాదాలే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus