#BiggBossTelugu6: ఫస్ట్ డే బెడ్ రూమ్ ఫిట్టింగ్..! అసహనంతో కంటెస్టెంట్స్..!

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు లేని విధంగా కంటెస్టెంట్స్ కి కొత్త ప్రాబ్లమ్ వచ్చింది. హ్యాపీగా విలాసవంతమైన ఇంటిలో గడపచ్చని అనుకున్నవాళ్లకి చుక్కెదురైంది. బిగ్ బాస్ బెడ్ రూమ్ లో 8 బెడ్స్ ఉండటం అనేది ఈసారి పార్టిసిపెంట్స్ ని కన్ఫూజన్ లోకి నెట్టింది. అది కూడా కిక్కిరిసిన గదిలా ఉండటం అనేది పార్టిసిపెంట్స్ ని ఇరకాటంలోకి నెట్టింది. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం రోహిత్, మెరీనా కపుల్ ఉన్నారు కాబట్టి వాళ్లిద్దరూ ఒక హెడ్ ఆక్యుపై చేసినా కూడా మిగతా పార్టిసిపెంట్స్ 19మందికి కలిపి కేవలం 7 బెడ్స్ ఉండటం అనేది ఆశ్చర్యకరం.

గతంలో బిగ్ బాస్ హౌస్ లో బెడ్ రూమ్ చాలా విశాలంగా ఉండేది. అక్కడ గేమ్ కూడా ఆడేందుకు టాస్క్ ఆడేందుకు పార్టిసిపెంట్స్ కి అనుకూలంగా ఉండేది. కానీ, ఇప్పుడు చేసిన సెట్ లో బెడ్ రూమ్ టైట్ గా ఉండటం అనేది కొద్దిగా పార్టిసిపెంట్స్ ని ఇబ్బందికి గురి చేస్తోంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక బెడ్ రూమ్ లో కెమెరా వ్యూజవల్స్ అమీర్ పేట హాస్టల్స్ ని తలపిస్తున్నాయి. ఇది బిగ్ బాస్ బెడ్ రూమా ? లేదా అమీర్ పేట హాస్టలా ? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అమీర్ పేటలో జెంట్స్ హాస్టల్స్ ఇంకా విశాలంగా ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి 21మందిని ఎప్పుడూ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించలేదు. 18మందికి సరిపడా మాత్రమే ప్లాన్ చేసి ఇప్పుడు ఇంకో ముగ్గుర్ని పంపించేసరికి బెడ్ రూమ్ ఇరుకు అయిపోయింది. దీంతో కొంతమంది పార్టిసిపెంట్స్ కింద పడుకోవాల్సి వచ్చింది. అబినయశ్రీకి బెడ్ దొరక్క హాల్లో ఎడ్జెస్ట్ అయితే, చలాకీ చంటి, షానీ, ఆర్జే సూర్య కింద పడుకునేందుకు సిద్ధపడ్డారు. ఫస్ట్ డేనే బెడ్ రూమ్ యాక్సెస్ స్టార్ట్ అవుతుంది అనగానే పార్టిసిపెంట్స్ పరిగెత్తి మరీ ఎవరి బెడ్ ని వాళ్లు సొంతం చేసుకున్నారు.

దీంతో మిగతా పార్టిసిపెంట్స్ కి బెడ్ దొరకలేదు. మరి ఈ బెడ్ రూమ్ కోసం, బెడ్ కోసం ఏదైనా సపరేట్ టాస్క్ పెడతాడా ? లేదా మిగతా వాళ్లని అలాగే ఉంచేస్తారా అనేది ఆసక్తికరం. మరోవైపు ఫస్ట్ టైమ్ 21మందిని హౌస్ లోకి పంపించేసరికి ఎవరి గేమ్ ఏంటి అనేది ఆడియన్స్ కి అర్ధమయ్యేసరికి కాస్త టైమ్ పట్టేలాగానే కనిపిస్తోంది. అంతేకాదు, ఈసారి నామినేషన్స్ లో ఎంతమంది వస్తారు అనేది కూడా ఆసక్తికరం. అదీ మేటర్.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus