War2 Movie: వైరల్ అవుతున్నవార్-2 లీక్ వీడియో..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ తో బాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. యశ్ రాజ్ స్పై యూనివర్స్లో భాగంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. బాలీవుడ్లోనే మోస్ట్ యాంటీస్ పెటెడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్గా ‘వార్ 2’ రూపొందుతోంది. 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసిన నటించిన ‘వార్’ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు.

యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి రాబోతున్న స్పై మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్‘ వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న బాలీవుడ్ మూవీ కావడంతో తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైల్ నెలకొంది. ఈ క్రమంలోనే ‘వార్ 2’ నుంచి ఏ చిన్న న్యూస్ వచ్చినా అది క్షణాల్లో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది.

‘వార్ 2’ (War2) షూటింగ్ ని స్పెయిన్ లో మొదలుపెట్టారు. ఈ షూటింగ్ కి సంబంధించిన ఓ వీడియో లీకై నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. సినిమాకు సంబంధించిన మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ షూటింగ్ కు సంబంధించిన వీడియోని ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే ఈ వీడియో లో ఎన్టీఆర్ ఫైట్ సన్నివేశంలో ఉన్నారని ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో బీజీగా ఉన్నారని తెలుస్తోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags