Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » వ‌స్తున్నాం..బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొడుతున్నాం..ఇది ఫిక్స్ !

వ‌స్తున్నాం..బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొడుతున్నాం..ఇది ఫిక్స్ !

  • December 12, 2017 / 06:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వ‌స్తున్నాం..బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొడుతున్నాం..ఇది ఫిక్స్ !

అఖిల్ హీరోగా సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానుల‌ను, సినీ ప్రేక్ష‌కులను `హ‌లో`అంటూ డిసెంబ‌ర్ 22న ప‌ల‌క‌రించ‌బోతున్నారు యూత్ కింగ్ అఖిల్ అక్కినేని. ఈయ‌న క‌థానాయ‌కుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్ల‌ర్‌ ‘హలో’. ఈ చిత్రం డిసెంబర్‌ 22న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతుంది. అనూప్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం వైజాగ్‌లో జరిగింది. బిగ్‌ సీడీని ఆంధ్రప్రదేశ్ మాన‌వ వ‌న‌రుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఆడియో సీడీలను గంటా శ్రీనివాసరావు విడుదల చేయగా, తొలి సీడీని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అందుకున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుద‌లైంది. అక్కినేని అభిమానులు, ప్రేక్ష‌కుల న‌డుమ వైజాగ్ సాగ‌ర తీరంలో వైభవంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలోమ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ రూబెన్స్ పాట‌ల‌కు లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌డ‌మే కాకుండా ప్రేక్ష‌కుల‌ను సింఫ‌నీ మ్యూజిక్ లైవ్ షోతో అల‌రించారు. ఇక యూత్ కింగ్ అఖిల్ మెరిసే మెరిసే అనే సాంగ్‌కు స్టేజ్‌పై స్టెప్పుల‌తో అద‌ర‌గొట్ట‌డ‌మే కాకుండా `ఏవేవో క‌ల‌లు క‌న్నా..ఏ వైపో క‌దులుతున్నా…ఏమైందో తెలియ‌కున్నా..ఎన్నెన్నో జ‌రుగుతున్నా..` అనే బ్యూటీఫుల్ సాంగ్‌ను లైవ్‌లో పాడి అంద‌రినీ అల‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో …

ప్ర‌తి సీన్‌ను ఎంతో ప్రేమ‌తో తీశారు
కింగ్ నాగార్జున మాట్లాడుతూ – ”అఖిల్‌తో దగ్గరుండి సినిమా చేస్తానని మాటిచ్చాను. అఖిల్‌ సినిమా కంటే ముందుగా చైతన్యతో ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ అనే సినిమా చేశాను. అదే ఆడియో వేడుకలో `వస్తున్నాం..కొడుతున్నాం..`అని చెప్పాను. అన్నట్టే హిట్ కొట్టాం. అది పూర్తయిన తర్వాత అఖిల్‌తోఈ సినిమా చేసే పనిలోనే ఉన్నాను. మా మనసుకు దగ్గరైన డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌. మా నాన్నగారి ఆఖరి సినిమా ఎలా తీయాలి?. తెలుగు ప్రేక్షకులు హృదయాల్లో లెజెండ్‌గా నిలిచిపోయిన నాన్నగారి ఆఖరి సినిమా ఎలా తీయాలనుకుంటుండగా, నాకు దేవుడులా వచ్చిన విక్రమ్‌కుమార్‌ నాతో మనం లాంటి సినిమా చేశాడు. నాన్నగారిని ఎంతో గొప్పగా సాగనంపాడు. ఇప్పుడు అఖిల్‌ని ఈ సినిమాతో రీలాంచ్‌ చేస్తున్నాను. అఖిల్‌ను ఎలా చూడాలనుకున్నాను అనే విషయాన్ని విక్రమ్‌తో చెబితే తను `హలో` సినిమాను తయారు చేశాడు. అక్కినేని అభిమానులు అఖిల్‌ను ఎలా చూడాలనుకుంటారో అలాగే ఈ సినిమాలో చూస్తారు. అలాగే విక్రమ్‌ కుమార్‌ను చైతన్యతో సినిమా చేయమని ముందుగానే అడిగాను. అన్నపూర్ణ స్టూడియోలో నెక్స్‌ట్‌ మూవీ విక్రమ్‌ దర్శకత్వంలో నాగచైతన్యతో ఉంటుంది. ఇదే ప్రేమతో ఆ సినిమా కూడా చేస్తాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి డ్యాన్స్‌, గ్రేస్‌ నేర్పింది అక్కినేని నాగేశ్వరరావుగారు. ఆయన అచ్చుగుద్దినట్లు అఖిల్‌లో కనపడతున్నాడు. అన్నపూర్ణ టీం అందరూ అఖిల్‌ను పెద్ద హీరోను చేయాలని.. ప్రేమతో ప్రతి యాక్షన్‌ని, సీన్‌ను తీశారు. చాలా రోజుల క్రితం ‘హలో గురు ప్రేమ కోసమేరా జీవితం..’ అని ప్రియన్‌గారు నన్ను, అమలను కలిపారు. డెస్టినీ అంటారో ఏమో కానీ, ఇప్పుడు ప్రియదర్శన్‌ అమ్మాయి క‌ల్యాణి ..అఖిల్‌తో సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో కల్యాణి అద్భుతంగా నటించింది. తనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఈ వేడుక‌కు ముందు వైజాగ్‌లో తుఫాన్‌ ఉందన్నారు. కానీ అన్నపూర్ణ టీం సభ్యులు ‘మీరు వైజాగ్‌ వెళ్లండి సార్‌..పైన నాన్నగారున్నారు. ఆయన చూసుకుంటారు’ అన్నారు. అదే భరోసాతో ఇక్కడికి వచ్చాను. మ్యాజిక్‌ జరిగింది. ఏం కాలేదు. మాకు వైజాగ్‌, రాజమండ్రి, కాకినాడ అంటే నాకు ప్రాణం. నేనైతే ఎన్నో సినిమాలను ఇక్కడ షూటింగ్‌ చేశాను. గంటా శ్రీనివాసరావుగారు మేం వైజాగ్‌లో ఫంక్షన్‌ చేయాలనగానే ‘ఏం కావాలి..నాగ్‌’ అన్నారు. అలాంటి వ్యక్తి వైజాగ్‌ పిలిస్తే ఎందుకు రాకుండా ఉంటాం. తప్పకుండా వస్తాం. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. డిసెంబర్‌ 22న ప్రేక్షకులు ముందుకు వస్తున్నాం. ఈ సినిమా మొదలయ్యేటప్పుడు ఎలాగైనా అఖిల్‌, అభిమానులకు హిట్ సినిమా ఇస్తాన‌ని..ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అనుకున్నాను. మూడు రోజుల క్రితమే సినిమాను చూశాను. `వస్తున్నామూ..బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడుతున్నాం…ఇది ఫిక్స్‌” అన్నారు.

డిసెంబ‌ర్ 22 కోసం వెయిటింగ్‌
అక్కినేని అమల మాట్లాడుతూ – ”చాలా చాలా ఆనందంగా ఉంది. అనూప్‌ రూబెన్స్‌ గారి మ్యూజిక్‌ అద్భుతం. సినిమాటోగ్రాఫర్‌ వినోద్‌గారు ప్రతి సీన్‌ను అద్భుతంగా తీశారు. కల్యాణికి అద్భుతమైన భవిష్యత్‌ ఉంటుంది. విక్రమ్‌కి ఇదొక గ్రేట్‌ సక్సెస్‌గా నిలుస్తుంది. అక్కినేని అభిమానులతో పాటు నేను కూడా డిసెంబర్‌ 22 కోసం వెయిట్‌ చేస్తున్నాను. ఆల్‌ ది బెస్ట్‌ టు యూనిట్‌” అన్నారు.
అఖిల్‌…అక్కినేని ఫ్యామిలీకి కొత్త ఇమేజ్‌ను, ఫేమ్‌ను తెస్తాడు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ – ”వైజాగ్‌ అనేది షూటింగ్‌లకు అనువైన స్థలం. సినీ పరిశ్రమకు హబ్‌గా నిలవాల్సిన నగరం. స్టీల్‌ ప్లాంట్‌తో పాటు, గ్రామీణ వాతావరణాన్ని తెలియజేసే స్థలం, ప్రముఖ దేవాలయాలు అన్నీ ఉన్నాయి. గతంలో చాలా మంది దర్శకులు, హీరోలు వైజాగ్‌లో షూటింగ్‌ చేయాలనే సెంటిమెంటును ఫాలో అయ్యేవారు. బాలచందర్‌గారు, జంధ్యాల వంటి పెద్ద దర్శకులు ఇక్కడే ఎక్కువ‌గా షూటింగ్ చేసేవారు. ఇలాంటి వైజాగ్‌కి సినీ పరిశ్రమ తరలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పట్లో నాగేశ్వరరావుగారు సినీ పరిశ్రమను ఇక్కడకు తీసుకు రావడానికి తొలి అడుగు ఎలా వేశారో..నాగార్జునగారు కూడా అలాంటి అడుగే వేయాలి. ఇప్పటికే రామానాయుడుగారి స్టూడియో ఇక్కడ ఉంది. చాలా మంది ఇక్కడ సినీ ప్రరిశ్రమను డెవలప్‌ చేయాలని కోరుకుంటున్నారు. సీ.ఎంగారు కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. సింగిల్‌ విండో ఆఫీసర్‌ని కూడా నియ‌మించాం. షూటింగ్‌లకు ఏ పర్మిషన్‌ కావాలన్నా ఈ ఆఫీసర్‌ దగ్గరుండి చూసుకుంటాడు. అలాగే `హలో` సినిమా విషయానికి వస్తే, సాంగ్స్‌, ట్రైలర్‌ అన్నీ చూశాం. అఖిల్‌ పెర్‌ఫార్మెన్స్‌ బావుంది. తను అల్‌రౌండర్‌గా ఎదుగుతాడు. ఈ సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది. అక్కినేని నాగేశ్వరరావుగారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలు పడి టాప్‌ రేంజ్‌కు ఎదిగారు. తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన నాగార్జునకు త‌న‌ని తాను ప్రూవ్‌ చేసుకోవాలనే ప్రెషర్‌ ఉండేది. ఈవాళ అఖిల్‌ను చూస్తుంటే, తాతగారు, నాన్నగారి ఇమేజ్‌ను కాపాడుకోవాలని ప్రెషర్‌ ఉంది. నాకైతే అఖిల్‌ అంటే `సిసింద్రీ`లో చేసిన అఖిలే గుర్తుకొస్తాడు. అక్కినేని ఫ్యామిలీకి కొత్త ఇమేజ్‌, ఫేమ్‌ తెచ్చేలా తను ఎదుగుతాడని కోరుకుంటున్నాను. సినిమా చూడటానికి డిసెంబర్‌ 22వరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు” అన్నారు .

విశాఖ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ – ”విశాఖ చరిత్రలో ఈ రోజు నిలిచిపోతుంది. మద్రాస్‌ మెరీనా బీచ్‌లో ఉన్న చలనచిత్ర పరిశ్రమను హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరానికి తరలించింది అక్కినేని నాగేశ్వరరావుగారైతే. నేడు హైదరాబాద్‌ నుండి వైజాగ్‌కు ఈ ప్రదర్శనతో వైజాగ్‌కు కళను తెచ్చింది మళ్లీ అక్కినేని కుటుంబమే. వైజాగ్‌లో అద్భుతమైన షూటింగ్‌ లోకేషన్స్‌ ఉన్నాయి. రెండు కొండల నడుమ ఉన్న విశాఖ తీర ప్రాంత పాదాల చెంత సాగర తీరం ఉంది. ఎర్రమట్టి దిబ్బలు, సూర్య దేవాలయం, బుర్రా గుహలున్నాయి. ఇక్కడ సబ్‌మెరైన్‌, యుద్ధ విమానంలో కూడా షూటింగ్‌ చేసే అవకాశాలున్నాయి. ఎ.ఎన్‌.ఆర్‌గారు ఎన్నో అడ్డంకులను దాటి సినీ పరిశ్రమను ఇక్కడకు తెచ్చారో, అలాగే విశాఖకు సినీ పరిశ్రమను అఖిల్‌ తీసుకొస్తాడని భావిస్తున్నాం. ఈ `హలో` చిత్రం..నాగార్జున హలో బ్రదర్‌ కంటే పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు. నేను హిట్ కొట్ట‌డానికి రెడీ

హీరో అక్కినేని అఖిల్‌ మాట్లాడుతూ – ”ఈ సినిమా మ్యూజికల్‌ జర్నీ ఏడాది క్రితం అనూప్‌తో ప్రారంభమైంది. తను మూడు నెలలు ప్రయత్నించి నాతో ఓ పాట పాడించాడు. అందుకు ముందుగా అనూప్‌కు థాంక్స్‌. అలాగే ఈ ఏడాది నాకొక ఎమోషనల్‌ జర్నీ. నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్‌గా ఇక్కడ నిలబడి ఉన్నానంటే అందుకు కారణం మా అమ్మనాన్నలే. వారెంతో సపోర్ట్‌ను అందించారు. విక్రమ్‌ నన్ను కలిసినప్పుడు నాలోని కాన్ఫిడెంట్‌, ఎనర్జీ లెవల్స్‌ అన్నీ తక్కువగా ఉన్నాయి. `హలో` చిత్రం ద్వారా నన్ను నేను కనుగొన్నాను. నా జీవితాంతం విక్ర‌మ్‌ను సోదరుడిగానే భావిస్తాను. అక్కినేని అభిమానులందరి తరపున విక్రమ్‌కు పెద్ద థాంక్స్‌. రెండేళ్లు నేను హీరోగా చేయకపోయినా అభిమానులందరూ సపోర్ట్‌ అందించారు. నేను హిట్‌ కొట్టడానికి రెడీ..మీరు రెడీయా! కొడుతున్నాం” అన్నారు.

ఆ కోరిక తీరుతుంది.
నాగచైతన్య(వీడియో ద్వారా) మాట్లాడుతూ – ”నాకు వైజాగ్‌ అంటే చాలా ఇష్టం. నా సినిమాలు చాలా వైజాగ్‌లో చిత్రీకరణను జరుపుకున్నాయి. ఇక `హలో` విషయానికి వస్తే ఆ సినిమా కోసం యూనిట్‌ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అఖిల్‌, నాన్న, ఎంటైర్‌ అన్నపూర్ణ ఫ్యామిలీ అంద‌రికీ గిఫ్ట్‌ ఇవ్వాలని ప్రయత్నించారు. అఖిల్‌ను ఓ లవ్‌స్టోరీలో చూడాలని నాలో చాలా కోరిక ఉండేది. ఆ కోరిక హ‌లోతో తీరుంది. తను చాలా బాగా డ్యాన్సులు, ఫైట్స్‌ చేయగలడు. `హలో` సినిమాలో బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీఉందని నాకు తెలుసు. లవ్‌ సినిమాను విక్రమ్‌ కంటే గొప్పగా ఎవరూ తీయలేరు. అనూప్‌కిది 50 వ సినిమా. కాబట్టి తనకు కంగ్రాట్స్‌. డిసెంబర్‌ నెల అక్కినేని వారికి స్పెషల్‌. ఈ నెలలో విడుదలైన సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. ఇదే నెలలో హలో కూడా విడుదలవుతుంది. ఈ టైటిల్‌ పెట్టగానే సినిమాపై పాజిటివ్‌ వైబ్స్‌ ప్రారంభమయ్యాయి. టీజర్‌, ట్రైలర్‌ చూడగానే నేను సినిమా హిట్‌ అవుతుందని ఫిక్స్‌ అయ్యాను. ఆల్‌ ది బెస్ట్‌ టు యూనిట్‌” అన్నారు.

`మ‌నం` మ్యాజిక్ రీ క్రియేట్ చేస్తారు
సమంత అక్కినేని(వీడియో ద్వారా) మాట్లాడుతూ – ”డిసెంబర్‌ 22 అక్కినేని సభ్యులకు, ఫ్యామిలీ మెంబర్స్‌కు స్పెషల్‌ డే అవుతుంది. ఈ `హలో` సినిమాకు పనిచేసిన వారందరూ ‘మనం’ సినిమాకు పనిచేసినవారే. ‘మనం’ మ్యాజిక్‌ను రీ క్రియేట్‌ చేస్తారని నమ్ముతాను. అఖిల్‌ కచ్చితంగా రాక్‌ చేస్తాడు. అనూప్‌ మ్యూజిక్‌ అందిస్తున్న 50వ సినిమా ఇది. సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ సాధిస్తుంది” అన్నారు.
గొప్ప అదృష్టం

ఇంత కంటే గొప్ప గురుదక్షిణ లేదు
డైరెక్ట‌ర్ ప్రియదర్శన్‌ మాట్లాడుతూ – ”నలభై ఏళ్ల సినీ అనుభవం..దర్శకుడిగా 92 సినిమాలు చేశాను. అయితే ఈ క్షణం నా జీవితంలో మరచిపోలేని క్షణం. నేను రెండు తెలుగు సినిమాలను డైరెక్ట్‌ చేశాను. అందులో ఎ.ఎన్‌.ఆర్‌గారితో ఓ సినిమా చేశాను. తర్వాత నాగార్జున, అమలతో మ‌రో సినిమా చేశాను. ఇప్పుడు నా తనయ కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా అక్కినేని అఖిల్‌ చిత్రంలో నటిస్తుంది. ఆ సినిమాకు నా ఫేవరేట్‌ శిష్యుడు, నా కంటే పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మా అమ్మాయి పరిచయం కావడం ఆనందంగా ఉంది. విక్రమ్‌ కుమార్‌ నాకు ఇచ్చే గురుదక్షిణ ఇంత కంటే ఇంకేం ఉంటుంది. థాంక్యూ..విక్రమ్‌” అన్నారు.

పాటలు అందరికీ న‌చ్చుతాయి
అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడుతూ – ”నాకు అవకాశం ఇచ్చినందుకు నాగార్జునగారికి, విక్రమ్‌కుమార్‌కి థాంక్స్‌. విక్రమ్‌తో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. తనతో పనిచేస్తున్నప్పుడు ఆత్మతో పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. తప్పకుండా అఖిల్‌ ‘హలో’ పాటలు అందరికీ నచ్చుతాయి” అన్నారు.

హీరోయిన్‌ కల్యాణి ప్రియదర్శన్‌ మాట్లాడుతూ – ”ఇది నా మొదటి సినిమా. తెలుగు భాష అంటే ఇష్టంతో మాట్లాడటం నేర్చుకున్నాను. నా తల్లిదండ్రులు, నాగార్జునగారి వల్లే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. నాగార్జునగారు ఎంతో కేర్‌ తీసుకుని నన్ను గైడ్‌ చేశారు. డైరెక్టర్‌ విక్రమ్‌గారి దర్శకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అఖిల్‌ అమేజింగ్‌ కోస్టార్‌. చాలా సపోర్ట్‌ చేశారు. అనూప్‌గారు అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చారు. థాంక్యూ ఆల్‌” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil's Hello Movie
  • #Hello Movie Audio Launch
  • #nagarjuna

Also Read

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

related news

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

trending news

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

21 mins ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

4 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

6 hours ago
Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

22 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago

latest news

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

18 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

18 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

18 hours ago
Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

19 hours ago
OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version