టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు .. ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. వరుసగా మహేష్ కు ఇది మూడవ హిట్ కావడం విశేషం. ఇప్పుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తన తదుపరి చిత్రం చేయబోతున్నాడు మహేష్. అది కూడా కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్. వంశీ పైడిపల్లి సినిమాలు మినిమం గ్యారంటీ కాబట్టి.. ఈ చిత్రం కూడా హిట్ అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయి. అంత వరకూ బాగానే ఉంది. కానీ మహేష్ రెగ్యులర్ గా ఇలా కమర్షియల్ సినిమాలు చేయడం వల్ల.. అతని ఓవర్సీస్ మార్కెట్ దెబ్బతినేసిందా? అనే చర్చలు జోరందుకున్నాయి.
ఒకప్పుడు మహేష్ సినిమా అంటే.. ఓవర్సీస్ లో విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి కనబడడం లేదు. ఇప్పుడు 2 మిలియన్ కొట్టడానికే కిందా మీదా పడుతున్నాయి. మహేష్ గత 4 చిత్రాలు అయిన ‘ బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ … లో ఒక్క ‘భరత్ అనే నేను’ మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం 2 మిలియన్ మార్క్ అందుకున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్తితి కనిపించడం లేదు. ఇలాగే కొనసాగితే మహేష్ ఓవర్సీస్ ఫ్యూచర్ కష్టమనే చెప్పాలి.