ఒకప్పుడు ఆ దర్శకుడు సినిమా అంటే.. మినిమం గ్యారంటీ..! అప్పటివరకూ మరీ డిజాస్టర్ అయ్యేంత సినిమాలు అయితే అస్సలు చేయలేదు. కానీ ఎప్పుడైతే స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలు పెట్టాడో.. అప్పటి నుండీ డిజాస్టర్లు పడడం.. మొదలయ్యాయి. ఆ డైరెక్టర్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా..! ఇంకెవ్వరూ మన శ్రీను వైట్ల. ఈయనకి ‘ఆగడు’ మొదలైన డిజాస్టర్ల జర్నీ.. ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. అయినప్పటికీ.. ‘బ్రూస్ లీ’ ‘మిస్టర్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ వంటి క్రేజీ సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది. అయినా సద్వినియోగపరుచుకోలేకపోయాడు.
అందుకే గ్యాప్ తీసుకుంటున్నాని చెబుతున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్. శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ” ఆడియన్స్ చాలా మారిపోయారు. కథను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సరైన కథ లేకుండా ఏం చేసినా.. వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. కొత్త కథలో ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి చెప్పడం కూడా చిన్న విషయం కాదు. అలాంటి కథలను పక్కన పెట్టి… ఫైనల్ గా వాళ్ళను మెప్పించే కథ ఒకటి అనుకున్నాను. దాదాపు 70 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. కొత్త ఏడాదిలో సినిమాని అనౌన్స్ చేస్తాను. వరుస డిజాస్టర్ల వల్ల నేనేమీ కృంగిపోలేదు. ఇప్పుడు శారీరకంగా, మానసికంగా.. మరింత దృఢంగా తయారయ్యాను” అంటూ చెప్పుకొచ్చాడు.