బాలయ్య కుదరడం లేదు.. చిరు కష్టం

మంచి హిట్‌ కొట్టాక… వరుస అవకాశాలు వస్తాయి అంటుంటారు. అయితే టాలీవుడ్‌లో ఇది అందరి దర్శకులకు సాధ్యం కాదు. మాస్‌ డైరక్టర్ల విషయంలో ఇది చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది. ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన దర్శకులు చాలా మంది చాలా రోజులు ఖాళీగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. సరైన కథ సెట్‌ అయినా, హీరో కుదరకపోవడం, నిర్మాతలు సెట్‌ కాకపోవడమే దీనికి కారణం. ఇప్పుడు ఇలాంటి కారణంతోనే మరో హిట్‌ దర్శకుడికి గ్యాప్ వస్తోంది. అతనే ‘క్రాక్‌’ దర్శకుడు గోపీచంద్‌ మలినేని.

సంక్రాంతికి ‘క్రాక్‌’ లాంటి హిట్‌ ఇచ్చిన గోపీచంద్‌ తర్వాతి సినిమా ఏమవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో బాలకృష్ణతో సినిమా ఉండబోతోంది అంటూ వార్తలొచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని అన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ ప్రాజెక్టు సెట్‌ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో మరో హీరోను సెట్‌ చేసుకునే పనిలో ఉన్నారు. దీంతో ఎప్పుడు గోపీచంద్ సినిమా ఉంటుందో తెలియడం లేదు. మరోవైపు చిరంజీవికి గోపీచంద్‌ కథ చెప్పాడని వార్తలూ వచ్చాయి.

‘క్రాక్‌’ చూశాక స్పందించిన హీరోల్లో మెగాస్టార్‌ ఒకరు. ఆ తర్వాత గోపిన ఇంటికి పిలిచి మరీ మాట్లాడాడు. ఒంగోలుతో తన అనుబంధాన్ని పంచుకున్నాడు కూడా. దాంతోపాటు ‘ఆచార్య’ సెట్‌కి రమ్మని కూడా ఆహ్వానించాడట. అయితే ఈ క్రమంలో గోపీచంద్‌ తన దగ్గర ఉన్న ఓ పాయింట్‌ కూడా చెప్పాడని వినిపించింది. అయితే దీని మీద ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు చిరంజీవి చాలా బిజీగా ఉన్నాడు. ‘లూసిఫర్‌’ రీమేక్‌, ‘వేదాళం’ రీమేక్‌, బాబి సినిమా వరుసలో ఉన్నాయి. ఆ తర్వాత గోపీ సినిమా ఉంటుంది. కాబట్టి గోపీ తర్వాత సినిమా కోసం వెయిటింగ్‌ తప్పదు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus