‘పిట్టగోడ’ అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు కె.వి.అనుదీప్ (KV Anudeep) . ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే తర్వాత చేసిన ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇతన్ని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేర్చేసింది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) … అనుదీప్ ని పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చేలా చేసింది. అలా చేసిన ‘ప్రిన్స్’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో అనుదీప్ ఏడాదిగా(2023 మొత్తం) ఖాళీగా ఉండాల్సి వచ్చింది అని చెప్పాలి.
అలా అని అనుదీప్ కి ఛాన్స్ ఇవ్వడానికి హీరోలు రెడీగా లేరా అంటే కాదు? నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) హీరోగా చేయాల్సిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాని అనుదీప్ డైరెక్ట్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడిపోయింది. అసలు ఉంటుందో లేదో? అనేది తెలీదు. అది పక్కన పెట్టేస్తే.. రవితేజ (Ravi Teja) కూడా అనుదీప్ కి ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లోనే ఈ ప్రాజెక్టు కూడా రూపొందాల్సి ఉంది.
అయితే ఇదే బ్యానర్లో రవితేజ ఇంకో సినిమా చేస్తున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్లో 75 వ (RT75) సినిమాగా రూపొందుతుంది. ‘అప్పుడు అనుదీప్ సినిమా లేనట్టేనా?’.. ఈ డౌట్స్ అందరిలోనూ ఉన్నాయి. రవితేజకి అనుదీప్ ఇంకా ఫైనల్ నెరేషన్ ఇవ్వలేదట.అప్పుడు ‘అనుదీప్ ఎప్పుడు స్క్రిప్ట్ కంప్లీట్ చేసి రవితేజకి వినిపిస్తాడు? ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది? అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా?’ వంటి విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.