విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డమ్’ సినిమా రూపొందింది. విజయ్ దేవరకొండ కెరీర్లో 12వ సినిమా ఇది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ కెరీర్లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అనిరుధ్ సంగీతం అందించారు. సినిమాలో పాటలన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది.
గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అన్నీ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. జూలై 31న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. వాటి స్టేటస్ కూడా బాగుంది. ప్రీ సేల్స్ రూపంలో మంచి నెంబర్స్ రిజిస్టర్ అవుతున్నాయి. జూలై 30న ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వాటికి మంచి రెస్పాన్స్ వస్తే.. కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ నమోదవుతాయి.
ఇదిలా ఉండగా.. ‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చినప్పటి నుండి ఈ సినిమా కథ గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమా కథ విశాల్ నటించిన ఓ ప్లాప్ సినిమాకి దగ్గరగా ఉంటుందని అంటున్నారు. విషయంలోకి వెళితే.. 2009 లో విశాల్ హీరోగా ‘పిస్తా'(తోరనై) అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కథ ఏంటంటే.. చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోయిన అతని అన్నయ్యని వెతుక్కుంటూ పెద్దయ్యాక తమ్ముడు సిటీకి వస్తాడు. ఆ టైంలో అనుకోకుండా 2 రౌడీ గ్యాంగులతో గొడవ పడతాడు. అందులో ఓ గ్యాంగ్ కి చెందిన లీడర్ హీరో అన్న. అతని మనసు మార్చి హీరో తిరిగి తన ఊరుకు తీసుకెళ్లడమే మిగిలిన స్టోరీ. తాజాగా రిలీజ్ అయిన ‘కింగ్డమ్’ ట్రైలర్లో కూడా ‘పిస్తా’ కథ ఛాయలు కనిపించాయి.చూడాలి మరి దర్శకుడు గౌతమ్ ఏమైనా తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తాడేమో.