మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా రూపుదిద్దుకుంటుంది. ‘వ్రిద్ది సినిమాస్’ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థపై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఆల్రెడీ ఈ సినిమా నుండి ‘ఫస్ట్ షాట్’ అంటూ ఓ గ్లింప్స్ వదిలారు. అది ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేసింది. చరణ్ లుక్, యాక్షన్ సీక్వెన్స్ లు, అలాగే క్రికెట్ షాట్ వంటివి హైలెట్ అయ్యాయి. 2026 మార్చి 27న ‘పెద్ది’ రిలీజ్ కానున్నట్టు కూడా గ్లింప్స్ తో స్పష్టం చేశారు. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ 3 పాటలు ఓకే అయిపోయినట్టు కూడా దర్శకుడు బుచ్చిబాబు ఇదివరకే రివీల్ చేశారు. అందులో ఓ పాటని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఆగస్టు 26న ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది వినాయకుడుపై చిత్రీకరించే సాంగ్ అని టాక్. వినాయక చవితి సంబరాల్లో భాగంగా..స్టేజీల వద్ద మైకులు పెడతారు. అప్పుడు వినాయకుడుపై చేసిన పాట అన్ని స్టేజీల వద్ద మార్మోగుతుంది అనేది మేకర్స్ ప్లాన్ గా తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.