The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’.. అసలేంటీ సినిమా? ఎందుకీ వివాదం!

‘ది కేరళ స్టోరీ’.. ఈ సినిమా గురించి చాలా రోజుల క్రితమే మన ఫిల్మీ ఫోకస్‌లో చదివి ఉంటారు. ఒకానొక సమయంలో కేరళ నుండి విదేశాలకు వెళ్లిన మహిళల దుస్థితిని వివరిస్తున్నాం అంటూ ఆ సినిమా మొదలుపెట్టారు. తొలినాళ్లలో ఈ సినిమా గురించి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఏమైందో ఏమో ఆ తర్వాత మళ్లీ చర్చ రాలేదు. అయితే ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమవుతుండే సరికి మొత్తంగా పరిస్థితి మళ్లీ వేడెక్కింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.

దేశ సినిమా పరిశ్రమలో ఈ సినిమా ఇప్పుడొక వివాదాల కేంద్రబిందువు. థియేటర్లలోకి రాకముందే సినీజనాల్ని రెండు వర్గాలుగా విడదీసింది అని చెప్పొచ్చు. ఓవైపు రాజకీయ నాయకులు, మరోవైపు సామాన్యులు కూడా చర్చిస్తున్నారు. ఈ సినిమాను నిషేధించాలని ఒక వర్గం డిమాండ్‌ చేస్తుంటే.. అలా చేయడం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అని మరొక వర్గం అంటోంది. కేరళ రాష్ట్రం నేపథ్యంలో సాగే ఈ సినిమా కథేంటి, వివాదం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.

కేరళకు చెందిన ముగ్గురమ్మాయిలపై కొన్ని దాడులు జరుగుతాయి. ఇలాంటివి పునరావృతం కాకూడదంటే మా మతంలోకి మారమంటూ ఒక స్నేహితురాలు సలహా ఇస్తుంది. దీంతో వాళ్లు మతం మారడం, తదనంతర పరిణామాలు.. ఆ తర్వాత ఉగ్రవాదుల ఘాతుకాలతో ఈ కథ సాగుతుంది. అయితే ఇదంతా వాస్తవ సంఘటనల నేపథ్యంలో రాసుకున్నవి అని ట్రైలర్‌లో చెప్పారు. ఇదే సమస్యకు కారణమైంది. ఇలా రాష్ట్రంలో ఎక్కడ జరిగిందో చెప్పండి అని ఓ వర్గం ప్రజలు అడుగుతున్నారు.

అసత్యాలు, అభూతకల్పనలతో రూపొందిన ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. న్యాయస్థానాలు గతంలో తప్పు పట్టిన ‘లవ్‌ జిహాదీ’ని ఈ సినిమాతో తెరపైకి తీసుకొచ్చారు అని మరికొందరు అంటున్నారు. ఇలాంటి సినిమాను మేం సమ్మతించం అని కేరళ సీఎం పినరయి విజయన్‌ హెచ్చరించారు. మరోవైపు ఈ సినిమాను నిషేధించాలని నేను కోరడం లేదు అని ఎంపీ శశి థరూర్‌ అంటున్నారు.

మరోవైపు (The Kerala Story) ఈ సినిమా ప్రధాన పాత్రధారిఅదా శర్మ అయితే.. నాకు వందల కొద్దీ బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయని వాపోయింది. కన్నూరులో షూటింగ్‌ చేస్తుండగా మాపై కొందరు దాడికి తెగబడ్డారంటూ దర్శకుడు మీడియాతో చెప్పారు. దీంతో ఇటువైపు నుండి కూడా చర్చ మొదలైంది. ఇంకోవైపు సినిమాను రాజకీయం చేయొద్దంటూ నిర్మాతలు కోరుతున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus