Puri, Vijay: పూరి, విజయ్‌ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటి?

దెబ్బ తినడం తప్పు కాదు.. ఆ తర్వాత దెబ్బలు తగిలించుకోకపోవడం గొప్ప అంటారు. తొలి దెబ్బ తర్వాత తనను తాను రక్షించుకుంటూ, ముందుకెళ్లాలి అంటారు. అలా కెరీర్‌లో వరుసగా దెబ్బలు తగులుతున్నా.. మొండిగా సినిమాలు చేస్తూ మరిన్ని దెబ్బలు తగిలించుకుంటున్నాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. అయితే ఐదు దెబ్బలు తర్వాత విజయ్‌కి సీరియస్‌నెస్‌ అర్థమవుతోందా? అవుననే అంటున్నాయి అతని సన్నిహిత వర్గాలు. తర్వాతి సినిమాల విషయంలో విజయ్‌ జాగ్రత్త పడాలని అనుకుంటున్నాడట.

‘లైగర్‌’గా ఇటవల థియేటర్లకు వచ్చిన విజయ్‌ దేవరకొండకి భారీ దెబ్బ తగిలింది. అతని కష్టాన్ని అందరూ ప్రశంసిస్తున్నా.. సినిమా ఫలితం మాత్రం పెద్ద షాక్‌లా మారింది. దీంతో తర్వాతి సినిమాల విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాడట. మోస్ట్‌ నెక్స్ట్‌ సినిమా అయిన ‘ఖుషి’ని వీలైనంత విడుదల చేసి, విజయం సాధించాలని నిర్ణయించుకున్నాడట. దీని కోసం శివ నిర్వాణ, నిర్మాతలతో మాట్లాడుతున్నాడని చెబుతున్నారు. అంతే కాదు, ఇప్పటికే పూరి జగన్నాథ్‌తో మొదలుపెట్టిన ‘జీజేఎం’ అలియాస్‌ ‘జన గణ మన’ సినిమా విషయంలోనూ మార్పులు అవసరమని భావిస్తున్నాడట.

‘లైగర్‌’ ఫలితం తర్వాత ‘జేజీఎం’ వస్తే ఓకేనా.. జనాలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారు. అనుకున్నంత హైప్‌ వస్తుందా? అనే భయం ఉందట. దాంతోపాటు సినిమా హైప్‌ కోసం విజయ్‌ ఏదైనా చెబితే.. ట్రోలింగ్ బారిన పడతామనే భయం కూడా ఉందట. అందుకే ‘జేజీఎం’ విషయంలో అప్పుడే ముందుకొచ్చే ఆలోచన లేదట. అయితే ఇప్పుడు ‘జేజీఎం’ కోసం అంత డబ్బులు పెట్టడానికి నిర్మాతలు రెడీనా? అనేది కూడా డౌటే అంటున్నారు. ‘లైగర్‌’ సినిమాకు భారీ నష్టం రావడంతో.. ఈసారి భారీ బడ్జెట్‌ పెట్టే పరిస్థితి లేదు.

ఇప్పటికే ఈ సినిమా కోసం ఐదారు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఆ మధ్య సినిమా అనౌన్స్‌మెంట్‌, ప్రాక్టీస్‌ క్లాస్‌లు అంటూ కొంతమేర ఖర్చయిందట. ఈ నేపథ్యంలో ఇప్పుడే సినిమా ఆపేస్తే అంత లాస్‌ వస్తుంది. అలా కాకుండా ముందుకెళ్లి తేడా కొడితే కష్టమే కదా అంటున్నారు. అయితే ‘లైగర్‌’లో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా ‘జేజీఎం’ సినిమా పూర్తి చేస్తే విజయం పక్కా అని అనేవాళ్లూ ఉన్నారు. మరి పూరి అండ్‌ కో ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు కాదు కానీ కొద్ది రోజుల తర్వాత తెలియొచ్చు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus