జనసేన పార్టీ స్థాపించి అయిదేళ్లవుతోంది. గత ఎలక్షన్స్ లో టి.డి.పి & బిజీపీ కూటమికి సపోర్ట్ చేసి వాళ్ళ గెలుపులో కీలకపాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఈ సార్వ్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాన్ని స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి పవన్ కళ్యాణ్ జనల్లోకి వెళుతూనే ఉన్నాడు. ప్రతి ఊరిలో పర్యటిస్తూ జనాలతో మాట్లాడుతూ వారిలో మమేకమయ్యాడు. ఇక్కడివరకూ బాగానే ఉంది. కానీ.. ఆంధ్రాలో ఎన్నికల డేట్ ను ఫైనల్ చేసిన తరుణంలో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది ఎవరికీ అర్ధం కావడం లేదు.
ఇవాళేదో ఉన్నపళంగా ఓ 17 స్థానాల్లో పోటీ చేయనున్న సభ్యులను ప్రకటించాడు తప్పితే.. కార్యాచరణ ఏమిటి? ఒక్కొక్క జిల్లాలో వర్కింగ్ మెంబర్స్ ఎంత మంది, ప్రచారం ఎప్పటి నుంచి మొదలెడతాడు. జిల్లాల వారిలో కోర్ టీం ఎవరు అనేది ఇప్పటివరకు వెల్లడించలేదు కదా కనీసం సెలక్షన్ కూడా పూర్తవ్వలేదుపోనీ ఎలక్షన్స్ కి ఇంకో నాలుగు నెలలున్నాయా అంటే అదీ కాదు.. సరిగ్గా నెల ఉంది. ఈ నెల రోజుల్లో 175 స్థానాల నుంచి పోటీ చేయడానికి మెంబర్స్ ను ఎన్నిక చేయాలి, వాళ్ళని జనాలకి పరిచయం చేయాలి, జనాల్లోకి తీసుకెళ్లాలి, జనాలు వాళ్ళని గుర్తించాలి. ఇదంతా ఒక నెలలో జరగడం అనేది ఇంపాజబుల్. సో, పవన్ కళ్యాణ్ కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమవుతాడా లేక అసలు ప్లానింగ్ ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ కరెక్ట్ ప్లానింగ్ లేకుండా ఇలా ముందుకెళ్లడం అనేది ఆయన రాజకీయ భవిష్యత్ కు ఏమాత్రం మంచిది కాదు.