ఒక్క హిట్ ఇచ్చే కిక్ కంటే… ఫ్లాప్ ఇచ్చే హిట్ బ్యాక్ పవర్ ఎక్కువ అంటుంటారు సినిమా జనాలు. చాలామంది దర్శకులు ఈ సూత్రం ఆధారంగా టాలీవుడ్‌కి దూరమైపోయారు. కొంతమంది చాలా రోజుల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇస్తుంటారు. అయితే చాలామంది మళ్లీ సినిమాల ముఖం చూసిన సందర్భాలు లేవు. అలాంటి వ్యక్తుల్లో పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా దర్శకుడు అరుణ్ ప్రసాద్. 13సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు?
‘తమ్ముడు’తో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అరుణ్ ప్రసాద్ ఆ తర్వాత మరో 12సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అందులో మూడు కన్నడ, ఒక తమిళ సినిమా కూడా ఉన్నాయి. ఇక తెలుగు సినిమాల సంగతి చూస్తే ‘గౌతమ్ ఎస్‌ఎస్‌సి’ లాంటి హిట్ ఉంది. అవి కాకుండా బాలకృష్ణ కథానాయకుడిగా ‘భలేవాడివి బాసూ’, జగపతిబాబు ‘మా నాన్న చిరంజీవి’లాంటి సినిమాలు ఉన్నాయి. అయితే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ’ (2018) తర్వాత ఆయన మళ్లీ టాలీవుడ్‌లో కనిపించలేదు. ఇతర పరిశ్రమల్లోనూ సినిమాలు చేయలేదు.
ఇదే విషయాన్ని అరుణ్‌ప్రసాద్‌కు కొడుకు వరసైన ప్రముఖ యువ దర్శకుడు అనీల్ రావిపూడిని అడిగితే అసలు విషయం చెప్పుకొచ్చాడు. ‘‘ప్రస్తుతం అరుణ్ ప్రసాద్‌గారు సినిమాలు మానేసి వ్యాపారం చేస్తున్నారు. ‘గౌతమ్ ఎస్ఎస్‌సీ’ చిత్రం డైరెక్ట్ చేశాక, జగపతిబాబుగారితో ఒక సినిమా తీశారు. అది అంతగా ఆడలేదు. దీంతో కొన్నాళ్లు విరామమివ్వాలని భావించినట్టున్నారు’’ అని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. అంతేకాదు ‘‘ఆయనొచ్చి డైరెక్షన్ చేస్తానంటే మళ్లీ రైటర్ మారి పూర్తి స్క్రిప్ట్ రాయటానికి నేను రెడీ’’ అని కూడా చెప్పాడు.
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!