Mohan Babu: ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తారా.. లేఖ రాస్తారా?

  • January 13, 2022 / 10:43 PM IST

నువ్వు ఒకటంటే నేను రెండంటా… నువ్వు ఒకటి చేస్తే నేను రెట్టింపు చేస్తా అనే రకం మోహన్‌బాబు. టాలీవుడ్‌ను, అందులోని రైవల్రీని క్లోజ్‌గా ఫాలో అయ్యేవారికి ఈ విషయం బాగా తెలుసు. గత కొన్నేళ్లుగా చిరంజీవి – మోహన్‌బాబు మధ్య జరుగుతున్న టామ్ అండ్‌ జెర్రీ ఫైట్‌ గురించి కూడా తెలుసు. చాలామంది సినిమా పెద్దలు స్టేజీ మీదే ఈ మాట అన్నారు కూడా. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటారా. టాలీవుడ్‌ పెద్దరికం వద్దంటూనే… ఈ రోజు టాలీవుడ్‌ తరఫున చిరంజీవి ఓ పని చేశారు కదా అందుకు.

టాలీవుడ్‌ సమస్యల్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ ప్రయత్నం అంటూ చిరంజీవి ఈ రోజు మధ్యాహ్నం భోజనం సమయంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. సినిమా పరిశ్రమ గురించి కీలక విషయాలు చర్చించారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌ వచ్చేస్తూ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర మీడియాతో మాట్లాడారు కూడా. ఈ సందర్భంగా సినిమా ‘పెద్ద’రికం గురించి అన్యాపదేశంగా స్పందించారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌ గురించి మోహన్‌బాబు ఏం చేస్తారు అనేదే ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్‌ పెద్దరికం గురించి ఇటీవల చిరంజీవి మాట్లాడిన రోజు సాయంత్రమే మోహన్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. అందులో ఇన్‌డైరెక్ట్‌గా పెద్దరికం అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ప్రభుత్వాలతో ఎలా ఉండాలో చెప్పారు. దాంతో మరోసారి ఈ విషయంలో చిరంజీవి వర్సెస్‌ మోహన్‌బాబు అనుకున్నారు. అయితే మోహన్‌బాబు పరిశ్రమ గురించి వడివడిగా అడుగులు వేయలేదు. కేవలం ఓ లేఖ రాసి ఊరుకున్నారు.

అయితే ఇప్పుడు చిరంజీవి వెళ్లి జగన్‌ను కలిశారు కదా… మరి మోహన్‌బాబు కూడా ఏదో ఒకటి చేయాలి. ఆయన జగన్‌ను కలవాలి అంటే పెద్ద కష్టం ఏమీ ఉండదు. ఏదో సందర్భం పెట్టుకొని నేరుగా జగన్‌ను కలవగలరు. ఎందుకంటే వారిది కుటుంబం బంధం. కొత్త ‘మా’ అధ్యక్షుడు అయిన కొడుకు విష్ణుని తీసుకెళ్లి ఏపీ సీఎం జగన్‌ను కలసి… ‘మేం కూడా సినిమా వాళ్ల సమస్యల గురించి ఏపీ సీఎంతో చర్చించాం. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరుకుతుంది’ అని చెప్పొచ్చు. లేదంటే లేఖ అయినా రిలీజ్‌ చేయొచ్చు. చూద్దాం మరి మోహన్‌బాబు అండ్‌ కో. ఏం చేస్తారో.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus