‘కేజీయఫ్ 2’ వచ్చేసింది… ఇంకా అంతా ‘సలార్’ గురించి మాట్లాడుకుంటారు అని అందరూ అనుకుంటే… ‘కేజీయఫ్ 3’ ఉంది అంటూ లీక్ ఇచ్చి ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. సినిమా ఎండ్ టైటిల్స్‌లో ‘కేజీయఫ్ 3’ అనే పుస్తకరం చూపించి హింట్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఒకటే డౌట్. సినిమాను మూడో పార్ట్‌కు కొనసాగించడానికి ఇంకా ఏం పెండింగ్ ఉంది. ఎందుకంటే సినిమాలో ఉన్న ప్రధానపాత్రధారులు అంతా చనిపోయారు. హీరో, విలన్స్, హీరోయిన్… ఇలా ఎవ్వరూ లేరు.
దీంతో మూడో పార్ట్ కోసం కథ ఏం ఉండొచ్చు, హీరోను ఎక్కడి నుండి తీసుకొస్తారు అనేదే ఇక్కడి మొదటి ప్రశ్న. సినిమాటిక్‌గా చూపించాలంటే ప్రమాదం నుండి రాకీ చాకచక్యంగా బయటపడినట్లు చూపించాలి. ఒకవేళ ఆ పని చేస్తే… రాకీ కొత్త సామ్రాజ్యం మనదేశంలో కాకుండా విదేశంలో చూపించొచ్చు. ఎందుకంటే సినిమా క్లయిమాక్స్‌లో అమెరికా, ఇండోనేషియా ప్రభుత్వాలు రాకీ మీద కేంద్రానికి ఫిర్యాదు చేస్తాయి. ఆ లెక్కన ఆ దేశాల్లో రాకీ తన సామ్రాజ్యం విస్తరించొచ్చు.
ఇది కాకుండా సీక్వెల్‌కి ఉన్న మరో అవకాశం… సినిమాకు మూలమైన పుస్తకం. ‘కేజీయఫ్’ పుస్తకాన్ని కేంద్రం నిషేధించిందని తొలుత నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. మూడో భాగంలో ఆ విషయాన్నే ప్రత్యేకంగా ప్రస్తావిస్తారనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇది కాకుండా ‘కేజీయఫ్’ ఫ్రాంచైజీగా మార్చి, రాకీ వేరే ప్రాంతానికి వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలూ కూడా చేస్తున్నారని అంటున్నారు. అయితే చిత్రబృందం నుండి ఈ విషయంలో ఎలాంటి స్పందనా లేదు.
అంతేకాదు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా చేస్తున్నాడు. ఇది రెండు పార్టులగా తెరకెక్కుతోంది. ఇది పూర్తయ్యాక తారక్ – మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేయాల్సి ఉంది. ఇదయ్యాక ‘ఉగ్రమ్’ మురళీతో సినిమా చేస్తా అని ప్రశాంత్ ఇటీవల చెప్పారు. దీని తర్వాత యశ్‌తో మరో సినిమా ఉంటుందని చెప్పారు. అది ఈ సినిమాయేనా లేక ఇంకో సినిమా అనేది తెలియాలి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!