SSMB28లో వరుస మార్పులకు కారణమేంటి..?

కొన్ని సినిమాలను ఏ ముహూర్తాన ఓకే అనుకుంటారో కానీ.. సినిమా ఓకే అవ్వడం, పట్టాలెక్కడం, షూట్‌ పూర్తవ్వడం, రిలీజ్‌ అవ్వడం విషయంలో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. దీంతో అంతా ఓకే అనుకుని ముందుకు వెళ్లినప్పుడల్లా సినిమాకు బ్రేక్‌లు పడుతూనే ఉంటాయి. టాలీవుడ్‌లో ప్రస్తుతం అలాంటి పరిస్థితిని కొన్ని స్టార్‌ హీరోల సినిమాలు ఎదుర్కొంటున్నాయి. అలాంటి వారిలో మహేష్‌బాబు ఒకరు. త్రివిక్రమ్‌తో మహేష్‌ సినిమా విషయంలోనే పైన చెప్పిన అడ్డంకుల్లో కొన్ని జరుగుతున్నాయి.

SSMB28 అంటూ మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమాను చాలా రోజుల క్రితమే ఘనంగా ప్రకటించారు. రేపోమాపో షూటింగ్‌ అనేలా తొలినాళ్లలో వార్తలు, పుకార్లు వచ్చాయి. అయితే తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సినిమా ఇదిగో, అదిగో అంటున్నారు తప్ప స్టార్ట్‌ అవ్వడం లేదు. నానా ఇబ్బందులు పడి సినిమా స్టార్ట్‌ అయ్యింది. అయితే ఏమైందో ఏమో కానీ.. తొలి షెడ్యూల్‌ని మధ్యలోనే ఆపేశారు అని వార్తలొచ్చాయి. తీసిన యాక్షన్‌ ఎపిసోడ్‌ను కూడా పక్కన పెట్టేయమని మహేష్‌ అన్నాడని టాక్‌.

ఆ తర్వాత ఒకటి రెండ్రోజులకు యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ని మార్చమని మహేష్‌ అడిగాడని వార్తలొచ్చాయి. ఆ తర్వాత గతంలో వచ్చిన కథ, కథనం సమస్య బయటకు వచ్చిందట. సినిమా కథలో మార్పులు అవసరం అనడంతో ఆ పనులు జరుగుతున్నాయని టాక్‌. ఇప్పుడు మరో టాక్‌ వస్తోంది. అదే సంగీత దర్శకుడు. ఈ సినిమాకు తమన్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అతని ప్లేస్‌లో అనిరుధ్‌ను తీసుకురావాలని చూస్తున్నారని ఓ మాట టాలీవుడ్‌ వర్గాల్లో నడుస్తోంది.

దీంతో అసలు SSMB28 విషయంలో ఏం జరుగుతోంది. సినిమా ఆలస్యానికి కారణమేంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. మహేష్‌ ఇంట్లో వరుస విషాదాలు ఓ కారణమని తెలుస్తున్నా.. ఇది కాకుండా ఇంకేదో బలమైన కారణం ఉంది అని అంటున్నారు. సినిమా కొత్త షెడ్యూల్‌ ఎప్పుడో చెప్పేస్తే.. ఈ సమస్యలు, పుకార్లు, చర్చలు ఉండవు. మరి సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌ టీమ్‌ ‘త్వరలో’ అనే మాట కాకుండా ఇంకేదైనా ఎప్పుడు చెబుతుందో?

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus