క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఆసక్తి రేపుతూ వచ్చిన చిత్రం ‘హిట్’ (HIT). నాని (Nani) సమర్పకుడిగా శేలేష కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విశ్వక్‌సేన్ అదరగొట్టాడు అని చెప్పాలి. కోపం, బాధ కలగలిపిన భావాలను భలేగా పండించాడు ఆ సినిమాలో. ఆ తర్వాత రెండో ‘హిట్’లో సెటిల్డ్ యాక్షన్‌తో అడివి శేష్ వావ్ అనిపించాడు. దీంతో మూడో ‘హిట్’ ఎలా ఉంటుంది అనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. తాజాగా ఈ విషయంలో మరో డిస్కషన్ పాయింట్ వచ్చింది.
అదే ఈ సినిమా ఏ స్థాయిలో రూపొందుతోంది అని. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే నాని దేశంలో చాలా ప్రాంతాలకు వెళ్తున్నాడు. అక్కడ లైవ్ లొకేషన్లలో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మామూలుగా రెండు ‘హిట్’ సినిమాలు చూస్తే పక్క రాష్ట్రాలకు వెళ్లింది లేదు. కానీ ఇప్పుడు అర్జున్ సర్కార్ ‘హిట్ 3’ (HIT 3) కోసం రాజస్థాన్, జమ్ము కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ వెళ్లాడు.
దీంతో ‘హిట్ 3’ సినిమా కోసం దర్శకుడు శైలేష్ కొలను భారీ ప్రయత్నాలే చేస్తున్నారు అని అర్థమవుతోంది. దానికి తోడు నాని పాన్ ఇండియా ఇమేజ్‌ను కూడా వాడుకుని ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం విశాఖపట్నం, హైదరాబాద్ కేసులు అంటే బాగోదు కానీ వివిధ రాష్ట్రాలకు సినిమాను స్ప్రెడ్ చేస్తున్నారు అని చెబుతున్నారు.
ఇక ఈ సినిమా ఇప్పటివరకు చూడని బ్లడ్ అండ్ మిస్టరీతో సాగుతుంది అని చెబుతున్నారు. ఈ మేరకు నాని పూర్తి వయెలెంట్ లుక్‌లో కనిపిస్తాడు అని చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో ‘హిట్ 1’ హీరో విశ్వక్‌సేన్ (Vishwak Sen) , ‘హిట్ 2’ (HIT 2) హీరో అడివి శేష్ (Adivi Sesh) కూడా కనిపిస్తారని సమాచారం అలాగే ‘హిట్ 4’ కోసం రవితేజ (Ravi Teja ) దాదాపు ఓకే అయ్యారని, ఆయన మూడో ‘హిట్’ క్లైమాక్స్‌లో కనిపిస్తారని టాక్.