Acharya VFX: ‘ఆచార్య’ వి.ఎఫ్.ఎక్స్ విషయంలో అంత కథ ఉందా?

  • May 23, 2022 / 07:49 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ చిత్రం మెగా ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేసింది. అసలు కొరటాల దర్శకత్వంలో చిరంజీవి సినిమా అన్నప్పుడు అంచనాలు ఓ రేంజ్లో పెరిగాయి. కానీ రిలీజ్ టైంకి అవన్నీ తగ్గిపోయాయి. వరుసగా పాన్ ఇండియా సినిమాల మధ్యలో విడుదలవ్వడం వలనో ఏమో కానీ ఈ మూవీకి కనీసం ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు. పోనీ ఓటిటిలో అయినా ఈ మూవీ ప్రేక్షకుల్ని అలరిస్తుందా అంటే ఇక్కడ అంతకు మించిన విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా .. ఈ చిత్రంలో ఓ సన్నివేశం ఉంటుంది.శంకర్ పాత్రని పోషించిన సత్యదేవ్ ఓ దళానికి లీడర్ గా కనిపిస్తాడు.అతను మరణిస్తున్న సమయంలో తన బిడ్డని ‘ఆచార్య'(చిరు) కి అప్పగిస్తాడు. ఆ టైములో చిరు యంగ్ లుక్ ను వి.ఎఫ్.ఎక్స్ లో మేనేజ్ చేయాలని చూశారు. కానీ ఆ లుక్ మెగా అభిమానుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.. కాదు కాదు పెడుతూనే ఉందని చెప్పాలి. నిజానికి ఈ లుక్ కు మహేష్ బాబుకి ఓ సంబంధం ఉంది అనేది ఇన్సైడ్ టాక్.

అదేంటి అంటే ఈ చిత్రంలో రాంచరణ్ పోషించిన సిద్ధ పాత్రకి మహేష్ ను అడిగాడు కొరటాల. మహేష్ కనుక ఓకే చెబితే.. యంగ్ చిరుగా చరణ్ ను చూపిద్దాం అనుకున్నాడట. కానీ మహేష్ కు ఆ పాత్ర నచ్చలేదు. కొరటాల శివ తనకి అత్యంత సన్నిహితుడు కాబట్టి నో చెప్పడానికి టైం తీసుకున్నాడు. ఇంతలో చిత్రనిర్మాతలు మహేష్ కు రూ.30 కోట్లు పారితోషికం ఆఫర్ చేశారు. ఇది కేవలం 15 నిమిషాల పాత్ర కోసమే. అయినా మహేష్ టైం తీసుకున్నాడట.

మహేష్ నొ చెప్పే వరకు రాకుండానే చిరు.. ‘ఆ పాత్రని చరణ్ తో చేయించుకుందాం’ అని కొరటాలకి చెప్పారట. అదే పారితోషికాన్ని కన్ఫర్మ్ చేస్తూ చిరు ఆ పాత్ర నిడివిని కూడా పెంచమని కొరటాలకి చెప్పినట్టు తెలుస్తుంది. దాంతో యంగ్ చిరు పాత్రకి చరణ్ ను కాకుండా వి.ఎఫ్.ఎక్స్ ను వాడాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఇక రాంచరణ్ సిద్ద పాత్రని ఏకంగా 45 నిమిషాలు పెంచేశారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus