టాలీవుడ్‌లో తన కామెడీ టైమింగ్, యూనిక్ స్టైల్ తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) , మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu) వంటి సూపర్ హిట్ తర్వాత, ఆయన నుంచి ప్రేక్షకులు మరో హిట్ ఎంటర్‌టైనర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. చివరగా అనుష్కతో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లో (Miss Shetty Mr Polishetty) కనిపించిన నవీన్, ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ చాలా రోజుల క్రితమే జరిగింది.
కానీ, ఆ తర్వాత ప్రాజెక్ట్ ఆలస్యం కావడం, నవీన్ చిన్న గాయాలపాలు కావడం వల్ల షూటింగ్ కొంతకాలం నిలిచిపోయింది. మధ్యలో సినిమాను పక్కనపెట్టారనే పుకార్లు కూడా వినిపించాయి. కానీ, ఇటీవల నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) “సినిమా పక్కా వస్తుంది” అని క్లారిటీ ఇచ్చేశారు. నవీన్ కూడా పూర్తి జోష్‌లో తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టాడు. ‘అనగనగా ఒక రాజు’ సినిమాకు కళ్యాణ్ శంకర్ (Kalyan Krishna) దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
సినిమాలో నవీన్ పోలిశెట్టికి జోడీగా ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి నటిస్తోంది. మేకర్స్ గతంలో రిలీజ్ చేసిన ‘ప్రీ వెడ్డింగ్ వీడియో’ గ్లింప్స్ నవీన్ కామెడీ టైమింగ్‌ను మరోసారి హైలైట్ చేయడంతో పాటు, మూవీపై బజ్ ను పెంచింది. ఇప్పుడు సినిమా పూర్తి కావడంతో మేకర్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే పనిలో పడ్డారు. అందరికీ తెలిసినట్టుగానే, డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. తాజా సమాచారం ప్రకారం, 2025 సంక్రాంతి సీజన్ లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఆ సమయానికి ఎలాంటి పెద్ద సినిమాలు లేనందున, ఈ మూవీకి మంచి థియేట్రికల్ రన్ దొరికే అవకాశం ఉంది. మొత్తం మీద, నవీన్ పోలిశెట్టిని మరోసారి కామెడీ యాంగిల్ లో చూడటానికి ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘అనగనగా ఒక రాజు’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కావడంతో, సంక్రాంతి బరిలో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.