కల్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) నుండి సినిమా వచ్చి 14 నెలలు దాటిపోయింది. కొత్త సినిమా ఎప్పుడు అని ఆయన ఫ్యాన్స్ అడుగుతున్నారు. ప్రేక్షకులు అయితే విజయశాంతి (Vijaya Shanthi) పవర్ ఫుల్ పాత్ర అని చెప్పిన సినిమా ఏమైంది అని అడుగుతున్నారు. ఈ రెండూ ఒకే సినిమాలే అని మీకు తెలిసి ఉండొచ్చు. కల్యాణ్ రామ్ 21వ సినిమాలో విజయశాంతి ఓ వపర్‌ఫుల్ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఆ సినిమా ముచ్చట్లే గత కొన్ని రోజులుగా వినిపించడం లేదు.
ఆ మధ్య సినిమా గురించి కొన్ని లీకులు, వార్తలు, అప్‌డేట్‌లు వచ్చాయి. సినిమా దాదాపు అయిపోవచ్చింది అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు. దీంతో ఆ సినిమా ఏమైంది, అసలు ఉందా? ఆపేశారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా పేరు ఇది అవ్వొచ్చు అంటూ రెండు టైటిళ్లను టీమ్ లీక్ చేసింది. ఈ లెక్కన సినిమా ఇంకా ఉంది అని చెప్పకనే చెప్పారు.
నందమూరి కళ్యాణ్ రామ్ 2023 డిసెంబరులో ‘డెవిల్’తో (Devil) వచ్చారు. ఆ తర్వాత ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా ఓకే చేశారు. ఈ సినిమా సంవత్సరానికి పైగా నిర్మాణంలోనే ఉంది. సినిమాకు కొన్ని టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ‘మెరుపు’, ‘రుద్ర’ అని రెండు పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలో టైటిల్ అనౌన్స్‌మెంట్ చేసి సినిమా ఇంకా ఉందని చెప్పబోతున్నారు.
ఇక సినిమా ఎందుకు ఆలస్యమవుతోంది అని చూస్తే.. ఓటీటీ డీల్ ఇంకా అవ్వలేదట. అలాగే రాబోయే వరుస నెలల్లో పెద్ద సినిమాలు లాక్ అయిపోయాయి కాబట్టి ఫ్రీ డేట్ చూసుకుని సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక కల్యాణ్‌రామ్ అనౌన్స్ చేసిన మరో సినిమా ‘బింబిసార 2’ (Bimbisara) పరిస్థితి కూడా అలానే మారింది. దర్శకుడు ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాక అప్‌డేటే రావడం లేదు.