Kamal Haasan Vs Vijay Sethupathi: బిగ్ బాస్ షో తమిళ్ హోస్ట్ లలో ఎవరు బెస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
- October 8, 2024 / 01:13 PM ISTByFilmy Focus
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో తమిళ్ వెర్షన్ కు హోస్ట్ గా పని చేయడం ద్వారా కమల్ హాసన్ (Kamal Haasan) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. గత సీజన్ వరకు కమల్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించగా బిగ్ బాస్ షో తమిళ్ సీజన్8 కు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే కమల్, విజయ్ సేతుపతిలలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.
Kamal Haasan Vs Vijay Sethupathi:

కమల్ హాసన్ బిగ్ బాస్ షో హోస్ట్ గా అదుర్స్ అనిపించారని విజయ్ సేతుపతి హోస్టింగ్ బాగానే ఉంది కానీ కొన్ని విషయాల్లో ఆయన ఇంప్రూవ్ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఒక్క ఎపిసోడ్ తో విజయ్ సేతుపతి టాలెంట్ ను డిసైడ్ చేయలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విజయ్ సేతుపతి రాబోయే రోజుల్లో తన హోస్టింగ్ తో మెప్పిస్తారేమో చూడాలి.
మరోవైపు బిగ్ బాస్ షో సీజన్8 తమిళ్ షాకింగ్ ట్విస్టులతో ఉండనుందని రెండో ఎపిసోడ్ లోనే ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బిగ్ బాస్ షో సీజన్8 రేటింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ షోకు గతంలో వచ్చిన రేంజ్ లో రెస్పాన్స్ అయితే రావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో లాంఛింగ్ ఎపిసోడ్ ఆదివారం రోజు ప్రసారం కాగా ఈ ఎపిసోడ్ కు ఏ రేంజ్ లో రేటింగ్స్ వస్తాయో చూడాల్సి ఉంది. విజయ్ సేతుపతి ఇటీవల మహారాజ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. విజయ్ సేతుపతి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా బిగ్ బాస్ షోకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. విజయ్ సేతుపతికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.













