బిగ్ బాస్ 4: స్టేజ్ పైన డ్యాన్స్ గేమ్ లో విన్నర్ ఎవరు..?

బిగ్ బాస్ హౌస్ లో రోజుకో టాస్క్ నడుస్తోంది. అఖిల్ తప్పించి అందరూ కూడా టాస్క్ లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో గెలిచిన వాళ్లు డైరెక్ట్ గా ప్రజలతో ఓట్లు వేయమని రిక్వస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ టాస్క్ లో గెలిచి అరియానా ప్రజలతో నేరుగా తన విన్నపాన్ని విన్నవించుకుంది. ఆ తర్వాత ఓపిక టాస్క్ లో విజేతగా నిలిచిన సోహైల్ ప్రజలని ఓట్ వేయమని రిక్వస్ట్ చేశాడు. ఇక మూడో టాస్క్ లో కూడా అరియానా గెలిచింది. మరోసారి ఓటింగ్ రిక్వస్ట్ ఛాన్స్ ని తీస్కుంది.

ఇక్కడే మరో టాస్క్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తూ ఉండాలి. మ్యూజిక్ ఆగిపోయినప్పుడల్లా ఒకరు స్టేజ్ పై నుంచి దిగాలి. దీనికోసం డిస్కషన్స్ పెట్టుకున్నారు హౌస్ మేట్స్. ఆల్రెడీ రెండుసార్లు వెళ్లి వచ్చావ్ కాబట్టి అరియానాని దిగిపోమని అడిగారు. కానీ నాకు పార్టిసిపేట్ చేయాలని ఉంది నెక్ట్స్ అయితే నేను దిగిపోతా అన్నది అరియానా. అయితే, సోహైల్ – నువ్వు మాట్లాడుకుని డిసైడ్ అవ్వమని హారిక సలహా ఇచ్చింది. మధ్యలో నన్ను ఇన్వాల్ చేయద్దు అంటూ సోహైల్ మాట్లాడాడు. చివరగా వాళ్లు మద్యలో ఆర్గ్యూమెంట్ అనేది లేకుండా అభిజిత్ స్టేజ్ పైనుంచి దిగిపోయాడు. అభిజిత్ ఇక్కడ సూపర్ గా గేమ్ ఆడాడాడు. అరియానాకి కౌంటర్ ఇచ్చాడు.

ఇక స్టేజ్ పైన అబిజిత్ దిగిపోయిన తర్వాత సోహైల్, అరియానాలు కూడా దిగిపోయారు. లాస్ట్ వరకూ డ్యాన్స్ చేస్తూ హారిక మోనాల్ ఇద్దరే ఉన్నప్పుడు మోనాల్ కోసం హారిక శాక్రిఫైజ్ చేస్తే మోనాల్ విన్నర్ గా నిలిచినట్లుగా సమాచారం. ఇక్కడ హారిక అండ్ అభిజిత్ ఈవారం గేమ్ ఆడిన తీరు సూపర్. నిజంగా ఇప్పుడు ఫినాలే వీక్ లో ఎలా ఉండాలో అలాగే ఉంటున్నారు. మిగతా పార్టిసిపెంట్స్ కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి ఓట్లు అడిగినా ఒకటే, వీరిద్దరూ అడగకపోయినా ఒకటే అన్నట్లుగా ఉంది పరిస్థితి. అదీ మేటర్.

[yop_poll id=”1″]

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus