Boyapati Srinu: బోయపాటి నెక్స్‌ సినిమా ఎవరితో? తిరిగి తిరిగి అక్కడికేనా?

కొంతమంది దర్శకులు కొంతమంది హీరోలతో సినిమాలు చేస్తేనే బాగుంటుంది. ఆ కాంబోలో సినిమా వస్తేనే విజయం పక్కా. అలాంటి కాంబినేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే తొలుత గుర్తొచ్చే పేరు ‘బాలకృష్ణ – బోయపాటి’. ఇప్పటికే మూడు సినిమాలతో భారీ విజయాలు అందుకున్నారు బాలయ్య, బోయపాటి. ఈ మాట బాగున్నా… బోయపాటి మిగిలిన హీరోలతో సినిమా చేస్తే విజయం దక్కదా? అనే ప్రశ్నకు ‘అవును’ అనే సమాధానం ఇచ్చేలా తయారైంది పరిస్థితి.

కావాలంటే మీరే చూడండి. తొలి సినిమా ‘భద్ర’ తర్వాత బోయపాటికి భారీ విజయాలు అందించింది కేవలం బాలకృష్ణ మాత్రమే. దీంతో ఇప్పుడు బోయపాటికి మళ్లీ ఆయనే ఛాన్స్‌ ఇవ్వాలి అనే పరిస్థితి ఏర్పడింది. రామ్‌తో ‘స్కంద’ చేసిన బోయపాటి బాక్సాఫీసు దగ్గర బొక్క బోర్లా పడ్డారు. సగటు బోయపాటి సినిమానే అది. కానీ రామ్‌కి విజయం దక్కలేదు. అదే కథతో బాలకృష్ణ సినిమా చేసుంటే కూడా విజయం అందుకోవచ్చు అనే కామెంట్లు కూడా వినిపించాయి.

ఆ సినిమా పరాజయం తర్వాత బోయపాటి (Boyapati Srinu) సినిమా ఏంటి? అనే ప్రశ్న వచ్చింది. గతంలో ఈ ప్రశ్న వచ్చిన ప్రతిసారి బాలయ్య సినిమానే సమాధానంగా ఉండేది. అయితే ఈసారి అల్లు అర్జున్‌ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో ‘సరైనోడు’ సినిమా చేశారు వాళ్లిద్దరూ. ఆ సినిమా ఫలితం, వసూళ్ల విషయంలో డబుల్‌ టాక్‌ ఉంది. ఒక విధంగా ఆ సినిమాకు మంచి ఫలితమే వచ్చింది కానీ.. సినిమా టీమ్‌ చెప్పినంత వసూళ్లు రాలేదు అని అంటుంటారు.

మరి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ ఇప్పుడు బోయపాటికి ఛాన్స్‌ ఇస్తారా? అనేది తెలియాలి. నిజానికి ‘స్కంద’ తర్వాత.. ‘పుష్ప’ తర్వాత బన్నీ – బోయపాటి కాంబో ఉందని గతంలోనే చెప్పారు. అయితే బన్నీ ఇప్పుడు పాన్‌ ఇండియా లెక్కలో తర్వాతి సినిమా త్రివిక్రమ్‌తో చేస్తారు అని అంటున్నారు. మరి బోయపాటి ఏం చేస్తారో? ఏ హీరోతో చేస్తారో చూడాలి. ఒకవేళ బాలయ్య సినిమా అంటే ‘అఖండ 2’ అవుతుంది అనే టాక్‌ ఆ మధ్య వినిపించింది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus