Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నటిని చంపేసి.. గ్లామర్ వాడుకొంటున్నారు

నటిని చంపేసి.. గ్లామర్ వాడుకొంటున్నారు

  • March 20, 2018 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నటిని చంపేసి.. గ్లామర్ వాడుకొంటున్నారు

90% సినిమా రివ్యూల్లో హీరోయిన్ల పనితనం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు సదరు సినిమాలో కథానాయిక అందాల ప్రదర్శన గురించి, యద సౌష్టవం గురించి. తొడ సౌందర్యాల గురించి రాస్తుంటారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే హీరోయిన్ల నటన గురించి రాస్తుంటారు. అది రివ్యూ రైటర్ల తప్పు కాదు సదరు సినిమాలో హీరోయిన్ ని కథా గమనం కోసం కాక కేవలం గ్లామర్ కోసం వాడడమే కారణం. అయితే.. ఇలా గ్లామర్ షోకి మాత్రమే పరిమితమైపోతున్న హీరోయిన్లు కేవలం అందుకే పనికొస్తారనుకొంటున్నారు కొందరు. అలా అనుకొనేవారి అంచనాలను తారుమారు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. మరి ఈ మధ్య కొత్తగా తెరకు పరిచయమవుతున్న టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ అయిన సాయిపల్లవి, నివేదా థామస్ లాంటి వారిని చూసి మనసు చివుక్కుమందో తెలియదు కానీ.. ఉన్నట్లుండి తమలోని నటిని ప్రేక్షక లోకానికి పరిచయం చేసే పనిలో పడ్డారు. ఆ విధంగా తమ నటనతో ఆశ్చర్యపరిచిన అందగత్తెల గురించి చెప్పుకోవాలి.

1. త్రిష Trishaహీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమై పదేళ్ళ పైనే అవుతుంది. తెలుగులో అందరు అగ్ర కథానాయకులతో మాత్రమే కాక యువ నాయకులతోనూ కలిసి నటించిన అనుభవం. తెలుగులో మాత్రమే కాక తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించింది త్రిష. అయితే.. పదేళ్ళలో ఎప్పుడూ ఆమె నటన గురించి మాట్లాడుకొని ఎరుగరు జనాలు. కానీ మొట్టమొదటిసారిగా మలయాళంలో రీసెంట్ గా నటించిన “హేయ్ జ్యూడ్” చిత్రంలో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకొంది. ఆ సినిమాలో సహజంగా నటించిన త్రిషను చూసి అందరూ షాక్ అయ్యారు. ఇన్నాళ్ళు ఈమెలోని ఇంత మంచి నటిని వినియోగించుకోకుండా స్విమ్మింగ్ ఫూల్స్ లో బికినీలు వేసి ఆడించి, హీరోల పక్కన బొమ్మలా నిల్చోబెట్టారా అని చిరాకుపడ్డవారు కూడా ఉన్నారు.

2. నయనతార Nayanataraపక్కా గ్లామర్ డాల్ గా ఇండస్ట్రీకి పరిచయమైన అమ్మడు నయనతార. “గజిని” సినిమాలో నయనతారను చూసి ఇప్పుడు ఆమెను చూస్తే ఎవ్వరైనా సరే “ఈమె ఆమేనా?” అని తప్పకుండా అడుగుతారు. ఆ రేంజ్ లో నటిగానే కాక ఫిజికల్ గానూ ట్రాన్స్ ఫార్మ్ అయ్యింది నయనతార. నాలుగైదేళ్ళ ముందు ఆమె కేవలం అందాల ఆరబోతకు మాత్రమే ఉపయోగపడేది. అయితే.. ‘శ్రీరామరాజ్యం”తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన నయనతార ఆ తర్వాత “కృష్ణం వందే జగద్గురుం”తో తన స్టామినాను ప్రూవ్ చేసుకొంది. ఇక రీసెంట్ గా వచ్చిన “కర్తవ్యం” సినిమాలో నయనతార నటన చూసినవాళ్ళందరూ “ఇది నయనతార నట విశ్వరూపం” అని పేర్కొనడం విశేషం.

3. రాశీఖన్నా Rashi Khannaతొలి చిత్రమైన “ఊహలు గుసగుసలాడే”లో పెర్ఫార్మెన్స్ తోపాటు అందంతోనూ అదరగొట్టిన రాశీ ఆ తర్వాత మాత్రం కేవలం గ్లామర్ రోల్స్ కి పరిమితమైపోయింది. ఒక్కో సినిమాలో గ్లామర్ డోస్ పెంచిందే తప్ప పెర్ఫారెన్స్ మాత్రం చేయలేదు. కాదు కాదు చేయనివ్వలేదు. ఇటీవల “టచ్ చేసి చూడు” సినిమాలో అంగాంగ ప్రదర్శన చేసి కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయిన రాశీ.. “తొలిప్రేమ” చిత్రంలో అసలు ఎలాంటి ఎక్స్ పోజింగ్ అనేది లేకుండా కేవలం నటనతో అలరించి.. హీరోగా నటించిన వరుణ్ తేజ్ కూడా డామినేట్ చేసింది.

4. అనుష్క Anushka“సూపర్”తో కథానాయికగా పరిచయమైన అనుష్కకు నటన వచ్చు అనే విషయం “అరుంధతి” చూసేవరకూ ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత “రుద్రమదేవి, బాహుబలి, భాగమతి” చిత్రాల్లో నటిగా తన విశ్వరూపం ప్రదర్శించింది అనుష్క. అయితే.. వరుసబెట్టి అలాంటి సినిమాల్లో నటించి బోర్ కొట్టేసి.. ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలనుందని స్వయంగా అనుష్క పలు ఇంటర్వ్యూస్ లో పేర్కొనడం విశేషం.

5. సమంత Samanthaతెలుగులో తొలి చిత్రమైన “ఏం మాయ చేసావే” చిత్రంతో నటిగా విశేషమైన గుర్తింపు సంపాదించుకొన్న సమంతకు ఆ సినిమా తర్వాత అన్నీ గ్లామర్ రోల్సే వచ్చాయి. కానీ… మళ్ళీ “ఈగ” సినిమాతో తన నట ప్రతిభను ఘనంగా చాటుకొంది. ఆ సినిమాలో అభినయ చక్రవర్తి సుదీప్ తో సమానంగా ఎమోషన్ ను పండించి శభాష్ అనిపించుకొంది. అయితే.. ఆ తర్వాత కూడా గ్లామర్ రోల్స్ తోపాటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కూడా చేసుకొంటూ ముందుకెళ్లడం గమనార్హం.

6. ఛార్మీ Charmeeపక్కా గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకొన్న పంజాబీ భామ ఛార్మీని చాన్నాళ్లపాటు కేవలం గ్లామర్ రోల్స్ కు పరిమితం చేశారు. ఒక్కోసారి మితిమీరిన ఎక్స్ పోజింగ్ చేసి వార్తల్లో కూడా నిలిచింది. అయితే.. “అనుకోకుండా ఒకరోజు” అనే సినిమాలో ఛార్మీ మేకప్ లేకుండా సహజంగా నటించిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు. ఛార్మీ ఎక్స్ పోజింగ్ చేయడం మాత్రమే కాదు అద్భుతంగా నటించగలదు అనే విషయం అప్పుడే జనాలకి అర్ధమైంది.

7. శ్రియ శరణ్ Shriya Saran“ఇష్టం” సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన శ్రియ కెరీర్ కొత్తలో మంచి పాత్రలు చేసినప్పటికీ తర్వాత పోటీ తట్టుకోలేక గ్లామర్ డోస్ పెంచింది. ఇక శ్రియ కెరీర్ అయిపోయింది అని ఆందరూ ఫిక్స్ అయిపోయిన తరుణంలో “మనం” సినిమాలో రామలక్షిగా అభినయంతో ఆకట్టుకొంది. మరి ఇప్పుడు పెళ్లైపోయింది కాబట్టి ఇకపై సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాలి.

8. రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singhకెరీర్ తొలినాళ్ళ నుంచే నటన కంటే గ్లామర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ వరుస అవకాశాలు రావడంతో నటనను పూర్తిగా పక్కనెట్టేసి ఏదో సినిమాల్లో అలా నటిస్తూ, హీరోల పక్కన డ్యాన్సులు చేస్తూ వెళ్లిపోయింది. కానీ.. “జయ జానకి నాయక” చిత్రంలో మాత్రం నటిగా తనను తాను ప్రూవ్ చేసుకొంది. ఈ సినిమాలో ఫస్టాఫ్ మొత్తం హుందాగల యువతిగా, సెకండాఫ్ మొత్తం ఎమోషన్ ఉమెన్ గా అద్భుతమైన నటన కనబరిచింది.

9. కాజల్ అగర్వాల్ Kajal Aggarwalఒక్క “చందమామ, మగధీర” తప్పితే ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా కనీస స్థాయిలో కూడా నటన ప్రదర్శించక ఇక ఈ అమ్మాయి నుంచి నటన ఎక్స్ పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అని కాజల్ అభిమానులు తప్ప అందరూ ఫిక్స్ అయిపోయిన తరుణంలో.. హిందీలో వచ్చిన “దో లఫ్జోంకి కహానీ” సినిమాలో అంధురాలిగా నేర్పుతో నటించిన కాజల్ ను చూసి ఖంగుతిన్నారు. అలాగే.. “నేనే రాజు నేనే మంత్రి”లోనూ రాధగా అద్భుతమైన నటనతో అలరించింది కాజల్.

10. తమన్నా Tamannaతమన్నా అసలు కెరీర్ స్టార్ట్ చేసిందే గ్లామర్ డాల్ గా. డైరెక్టర్లు, హీరోలు తమన్నా నడుము మీద పెట్టిన ధ్యాస ఆమె నటన మీద ఎప్పుడు పెట్టలేదు. వాళ్ళకే లేనప్పుడు నాకెందుకు అనుకొందో ఏమో కానీ తమన్నా కూడా ఎప్పుడూ తన నటనను ప్రూవ్ చేసుకోవాలనుకోలేదు. అయితే.. సురేందర్ రెడ్డి మాత్రం “ఊసరవెల్లి” సినిమాలో తమన్నా అందంతోపాటు ఆమె అభినయ సామర్ధ్యాన్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో బురదలో ఎన్టీయార్ కాళ్ళు పట్టుకుని ఏడ్చే సన్నివేశంలో తమన్నాను చూసి కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #charmee
  • #Kajal Aggarwal
  • #Nayanatara
  • #Rakul Preet Singh

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

7 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

11 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

12 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

12 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

30 mins ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

1 hour ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

6 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

7 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version