Bigg Boss 5 Telugu: సన్నీ కేక్ తింటే, అనీమాస్టర్ ఎందుకు ఫీల్ అయ్యిందో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కేక్ హౌస్ మేట్స్ మద్యలో పెద్ద చర్చలకి దారితీసింది. ఈకేక్ తినే అర్హత మీలో ఏ ఒక్కరికి ఉంది అని దానిపైన బోర్డ్ ఉండటం చూసిన హౌస్ మేట్స్ , ఆ అర్హత మాకే ఉందంటూ చర్చలు మొదలుపెట్టారు. అలాగైతే ఈవారం కెప్టెన్ అయ్యాను కాబట్టి అర్హత నాకే ఉంటుందని అనిమాస్టర్ చెప్పింది. అయితే, ఇక్కడే నామినేషన్స్ లో ఉన్న ఐదుగురులో ఒకరు తింటే ఇమ్యూనిటీ వస్తుందేమో అని రవి అందర్నీ లాక్ చేశాడు. దీంతో అనీమాస్టర్ కొద్దిగా మనసు మార్చుకుంది. లివింగ్ రూమ్ లో కూర్చుని డిస్కషన్ చేసిన తర్వాత అనీమాస్టర్ తిన్నా అభ్యంతరం లేదని కన్ క్లూజన్ కి వచ్చారు అందరూ.

అయితే, పింకీ మాత్రం మానస్ కి అర్హత ఉందంటూ మానస్ జపం చేసింది. ఇక పొద్దునే లేవగానే కేక్ వంక చూస్తూ పనులు చేస్కుంటున్నారు హౌస్ మేట్స్. శ్రీరామ్ యోగా చేస్తున్న టైమ్ లో ఖాళీగా కూర్చున్న సన్నీ కేక్ ని కమ్మగా తీస్కుని తినేశాడు. తినేసిన తర్వాత మనోడికి భయం స్టార్ట్ అయ్యింది. కేక్ మెల్ట్ అయిపోతుందని తిన్నానని, ఆకలేస్తుందని తిన్నానని కవరింగ్ స్టార్ట్ చేశాడు. దీంతో అనీమాస్టర్ కి పిచ్చకోపం వచ్చింది. హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ చేస్తే నువ్వెలా తింటావ్ అంటూ ప్రశ్నించింది. ఇది హౌస్ కాల్ కదా, నేను తినాలి కదా అంటూ మాట్లాడింది.

స్ట్రేటజీలు ప్లే చేస్తున్నావ్ అంటూ ఫైర్ అయ్యింది. కాసేపు బాధపడింది. ఈలోగా సన్నీ వచ్చి అనీమాస్టర్ కి ఎక్స్ ప్లయిన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, అనీమాస్టర్ వినలేదు. మొత్తానికి కేక్ ని పూర్తిగా తినేసిన సన్నీకి బిగ్ బాస్ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఇది డైరెక్ట్ నెక్ట్స్ వీక్ ఇమ్యూనిటీకి సంబంధించినది అయినా, లేదా మరేదైనా బెనిఫిట్ అయినా కూడా సన్నీకి మంచి లాభమే అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus