విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న రిలీజ్ కానుంది. అయితే జూలై 30 నుండి ప్రీమియర్స్ వేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది. కానీ ఊహించని విధంగా ఆ ఆలోచన విరమించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు ‘కింగ్డమ్’ థియేట్రికల్ ప్రయాణం జూలై 31 ఉదయం 7 గంటల షోల నుండి ప్రారంభం కానుంది.
వాస్తవానికి ‘కింగ్డమ్’ సినిమాకి ప్రీమియర్స్ వేయాలని నిర్మాత నాగవంశీ డిసైడ్ అయ్యారు. ప్రీమియర్స్ కోసం, అలాగే ఆంధ్రలో టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వం నుండి అనుమతి కూడా తెచ్చుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపునకు గురువారం నుండి అంటే జూలై 31 నుండి అనుమతి ఇచ్చింది. ఇక్కడ చిత్ర బృందం ప్రీమియర్స్ డేట్ ను(జూలై 30 రాత్రి 9 గంటల నుండి అని) సరిగ్గా ప్రస్తావించలేదట. అందువల్ల జూలై 31 నుండి టికెట్ రేట్లు పెంచుతూ జీవో పాస్ చేయడం జరిగింది.
ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకుని.. మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవాలి అంటే టైం పడుతుంది. అందుకే ప్రీమియర్స్ ఆలోచన విరమించుకుంది ‘కింగ్డమ్’ అండ్ టీం. ఒక రకంగా ఇది కూడా మంచికే జరిగింది అనాలి. ఎందుకంటే.. ప్రీమియర్స్ అయ్యాక సినిమా కొంచెం అటు ఇటుగా ఉంటే.. నెగిటివ్ ట్రెండ్స్ ఎక్కువవుతాయి. విజయ్ దేవరకొండ గత చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాకి ప్రీమియర్స్ వంటివి పడకపోయినా.. ముందు రోజు నైట్ నుండి నెగిటివ్ ట్రెండ్స్ స్టార్ట్ చేశారు. అదే మార్నింగ్ షోలకు అయితే ఇలాంటి ప్రమాదం ఉండదు.