Mahesh babu, Rashmika: ‘పుష్ప’ పై మహేష్ రివ్యూ.. రష్మిక ని మర్చిపోయాడేంటి..!

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. తాజాగా ఈ మూవీ చూసిన మహేష్ ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని తెలియజేసాడు.” పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన స్టన్నింగ్ అంటూ ప్రశంసించిన మహేష్.. ఇది ఒరిజినల్ అంటూ బన్నీని ఆకాశానికి ఎత్తేసాడు.అలాగే సుకుమార్ గురించి చెబుతూ.. ఎప్పుడూ అతని సినిమాలు వాస్తవంగా, నిజాయితీగా ఉంటాయని మరోసారి ప్రూవ్ చేసాడని మహేష్ తెలిపాడు. అలాగే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి చెబుతూ..

‘నీ గురించి ఏం చెప్పాలి? దేవి శ్రీ ప్రసాద్ నువ్వు రాక్ స్టార్‌ అంతే’ అంటూ పేర్కొన్నాడు.ఫైనల్ గా ‘పుష్ప’ ని నిర్మించిన ‘మైత్రీ మూవీ మేకర్స్’ వారిని కూడా అభినందించాడు మహేష్. చాలా గర్వంగా ఉంది అనే కామెంట్ కూడా పెట్టాడు. అయితే ‘పుష్ప’ లో శ్రీవల్లి పాత్రని పోషించిన హీరోయిన్ రష్మిక మందన గురించి మాత్రం మహేష్ మర్చిపోయాడు. దీంతో రష్మిక పై ట్రోలింగ్ మొదలైంది. ‘శ్రీవల్లిని అదీ నేషనల్ క్రష్ ను మహేష్ ఎలా మర్చిపోయాడు’ అంటూ కొంతమంది ప్రశ్నిస్తుంటే.. ‘

‘పుష్ప’ లో రష్మిక మందన ఉందనే విషయం అసలు ఎవరికి గుర్తుంటుంది?’ అంటూ మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.ఇది పక్కన పెడితే.. రష్మిక …మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది పైగా మహేష్ ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉంటుంది. పండుగలకు అప్పుడప్పుడు మహేష్ ఫ్యామిలీకి గిఫ్ట్ లు కూడా పంపుతుంటుంది రష్మిక. మరి మహేష్ ఏ విధంగా మర్చిపోయాడో..!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus