ఎప్పుడో విషయాన్ని తీసుకొచ్చి, అప్పుడెప్పుడో చెప్పిన వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు మళ్లీ అప్‌లోడ్ చేసి ఇప్పుడు వైరల్ చేయడం ఈ మధ్య ఎక్కువైపోయింది. అలా ప్రియాంక చోప్రాకి (Priyanka Chopra) సంబంధించి ఓ పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో తాను సినిమాల్లోకి రావడానికి ప్రయత్నించినప్పుడు ఎదుర్కొన్న అనుభవాల గురించి ఆమె చెప్పిన విషయమిది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చాలా ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమా చేస్తోంది.
తెలుగులో అయితే తొలిసారిగా తెలుగు సినిమా చేస్తోంది. అఫీషియల్‌గా ప్రకటించలేదు కానీ మహేష్ బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli) సినిమాలో ఆమె నటించనుంది అనేది తెలిసిన విషయమే. ఆ సినిమా కోసం గత కొన్ని రోజులుగా ఆమె హైదరాబాద్‌లోనే ఉంది. త్వరలో విదేశాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ ఉంటుంది అని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 19 ఏళ్ల వయసులో ఓ సినిమా గురించి చర్చించడానికి దర్శకుడి వద్దకు వెళ్లగా..
ప్యాంటీ బయటకు కనిపించేలా, లోదుస్తులు కనిపించేలా కూర్చోవాలని అన్నాడట. అలా చేస్తేనే ఆడియెన్స్ చూస్తారని చెప్పాడట. ఈ విషయం ఇంట్లో చెబితే ఆ సినిమాలో నటించొద్దు అని చెప్పారట. దీంతో ఆ అవకశం వదిలేశా అని చెప్పింది. అంతేకాదు ఆ దర్శకుడితో ఆ తర్వాత ఎప్పుడూ పనిచేయనని నిర్ణయించుకుందట. అనుకున్నట్లుగా ఎప్పుడూ పనిచేయలేదట.
ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎందుకు ఇంత చర్చ పెడుతున్నారు, ప్రియాంక ఆ చెప్పిన సీన్ల కంటే ఎక్కువగానే ఆ తర్వాత స్కిన్ షో, బోల్డ్ సీన్స్ చేసింది. ఇంగ్లిష్ సిరీస్, సినిమాల్లో ఎక్కువే చేసింది. కాబట్టి అప్పుడెప్పుడో జరిగిన విషయాల గురించి ఇప్పుడు మాటలు విని చర్చ పెట్టుకోవడం అనవసరం అనే మాటలు వినిపిస్తున్నాయి. అయినా ఇప్పుడామె గ్లోబల్ స్టార్.