టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా అది ఎంట్రీ వరకే ఉపయోగపడుతుంది. తరువాత ఆ హీరో ప్రూవ్ చేసుకోవలసిందే. ఏ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సొంతంగా పైకి వచ్చిన స్టార్లు కూడా ఎంతోమంది ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నుండీ, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఫ్యామిలీ సపోర్ట్ సో సో గా ఉన్నా… దాన్ని నిలబెడుతూ మహేష్ , ప్రభాస్ వంటి హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగారు. అయితే ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉన్నా.. ఇంకా నిలదొక్కుకొని హీరోల్లో బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అక్కినేని అఖిల్ వంటి వారిని చెప్పుకోవచ్చు.
అఖిల్ మొదటి చిత్రం ‘అఖిల్’ ఫెయిల్ అయ్యినప్పటికీ ‘హలో’ లాంటి ఒక సింపుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ చేసినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే ఆ చిత్రం చేయడానికి నాగ్ కి ఇష్టం లేదట. మొదట నాగ్ ‘హలో’ చిత్రం చేయడానికి అస్సలు ఒప్పుకోలేదట. అయితే అఖిల్,అమల పట్టుపట్టడంతో ఆ సినిమా చేయించాడని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇక మూడవ సినిమా అఖిల్ ఇష్టమని ‘హలో’ చిత్ర ప్రమోషన్స్ లో నాగ్ చెప్పకనే చెప్పాడు. అయినా కూడా హిట్టిచ్చే వరకు వదలకూడదని నాగార్జున భావించి… చాలా మంది డైరెక్టర్లతో డిస్కషన్లు జరిపినప్పటికీ వర్కౌట్ కాలేదని తెలుస్తుంది. ఈ క్రమంలో అఖిల్ కి సన్నిహితుడైన వెంకీ అట్లూరితో సినిమా చేస్తానని అఖిల్… నాగ్ కి ఇష్టం లేకపోయినా ‘మిస్టర్ మజ్ను’ చేసాడట. ఇదంతా అఖిల్ సొంత నిర్ణయమేనట. తన ఫ్యామిలీ లో ఎలాగైనా ఒక మాస్ హీరో ఉండాలని నాగ్ ఆశపడుతున్నప్పటికీ… అఖిల్ మాత్రం మాట వినట్లేదన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ ఉద్దేశంతోనే ‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ లో జూనియర్ ఎన్టీఆర్ ను చూపించి ‘ముందు ఎన్టీఆర్ లా మాస్ నేర్చుకోరా…’ అంటూ నవ్వుతూనే మనసులో ఉన్నది ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్టు స్పష్టమవుతుంది. ఇక అఖిల్ రెండు సినిమాలకు ప్రమోషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్న నాగ్… ‘మిస్టర్ మజ్ను’ చిత్ర ప్రమోషన్ల విషయంలో మాత్రం అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదట. ఇక తన కొడుకు నిర్ణయాలకి విసిగిపోయి నాగ్ సైలెంట్ అయిపోయాడని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ‘మిస్టర్ మజ్ను’ చిత్ర ఫలితం ఏమవుతుందో చూడాలి…!