(Nani) సినిమా కోసం కష్టపడ్డాం.. మీరు చూసి ఆశీర్వదించండి.. ఇదో రకం ప్రచారం. మేమో సినిమా చేశాం.. బాగుంటుంది. అయితే ఆ రోజుల్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు.. ఇది మరో రకం ప్రచారం. తొలి రకం ప్రచారం కంటే రెండో రకం ప్రచారంలో ఆ మాటలు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంటాయి. ఇది మేం అంటున్న మాట కాదు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో చాలామంది నటులు చేసి చూపించారు, కొంతమంది విజయం సాధించారు, ఇంకొంతమంది తుస్‌మనిపించారు. అయితే ఇప్పుడు ఇదే ప్లాన్‌ను నేచురల్ స్టార్ వాడుతున్నారా? ఏమో ఆయన మాటలు వింటుంటే అదే అనిపిస్తోంది.
నాని నటించిన ‘దసరా’ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించాం, అలానే విడుదల చేస్తాం అంటూ దేశం మొత్తం తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు నాని. ఈ క్రమంలో చాలా విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు. సినిమా ఎలా ఉంటుంది, ఏం చేశారు అనే విషయాలు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన తన మీద గతంలో వచ్చిన వివాదాల గురించి ప్రస్తావిస్తున్నారు, దాంతోపాటు తొలినాళ్లలో పడిన ఇబ్బందులు కూడా చెబుతున్నారు. దీంతో ఓ డౌట్ వస్తోంది నెటిజన్లకు. ఇన్నాళ్లూ ఈ విషయాలు టాలీవుడ్ మీడియా దగ్గర ఎందుకు చెప్పలేదు అని.
నాని ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ‘అష్టా చెమ్మా’తో హీరోగా టాలీవుడ్‌కి పరిచయమ్యాడు. అంతకుముందు దర్శకత్వ శాఖలో పని చేశాడు. హీరో అయ్యాక మళ్లీ అటువైపు వెళ్లలేదు కానీ, నిర్మాణంలోకి మాత్రం వచ్చాడు. అలా ఏటా కనీసం నాలుగైదు సార్లు మీడియా ముందుకు వచ్చాడు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే అక్కడ ఎక్కడా ఇలాంటి ప్రశ్నలు ఎదురుకాలేదో, లేక ఆ అవకాశం రాలేదో కానీ.. ‘దసరా’ ప్రచారం కోసం పక్క రాష్ట్రాలకు, పరిశ్రమలకు వెళ్లినప్పుడు ఆ ప్రశ్నలు వస్తున్నాయి. దానికి నాని చెప్పిన సమాధానాలు వైరల్‌గా మారుతున్నాయి.
‘‘సినిమాల్లో నటించే ప్రయత్నంలో ఉండగా ఒకరిద్దరు దర్శకులు నన్ను డ్రైవర్‌లా వాడేసుకున్నారు. రకరకాల పనులు చేయించుకునేవారు’’, ‘‘క్లాప్ బోర్డ్ ఆలస్యమైనా ఏదో ఒకటి అంటారు. ఒక దర్శకుడు మాత్రం సెట్‌లో అవమానించాడు’’ ఇలా కొన్ని విషయాలు నాని ప్రచారంలో చెప్పాడు. వీటి వల్ల ఆయన పడ్డ ఇబ్బందులు తెలుస్తాయి, అయితే పక్క ఇండస్ట్రీలోకి వెళ్లి ఇవి చెబితే.. ఆ ఇండస్ట్రీలో ఇలానే ఉంటుందా అనే డౌట్ కూడా వస్తుంది. కాబట్టి నాని ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, కష్టాలు చెప్పడానికేనా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?