Kalki: ముందే చెప్పాంగా… ఇదిగో టీమ్‌ కూడా చెప్పేసింది… ఎందుకనో ఇలా!

వైజయంతి మూవీస్‌ స్పెషల్‌ డేట్‌ నాడు… (Kalki 2898 AD) ‘కల్కి 2898 ఏడీ’ వస్తుంది అంటూ ఆ మధ్య ఘనంగా ప్రకటించింది టీమ్‌. ఆ డేట్‌కి ఆ సంస్థ నుండి వచ్చి రెండు సినిమాలు భారీ విజయం అందుకున్నాయి. ఇండస్ట్రీలో మరచిపోలేని సినిమాలుగా నిలిచాయి. దీంతో ‘కల్కి 2898 ఏడీ’తో హ్యాట్రిక్‌ కొట్టాలని కూడా అనుకున్నారు సినిమా ఫ్యాన్స్‌. అయితే లేటెస్ట్‌గా టీమ్‌ నుండి వచ్చిన కొత్త పోస్టర్‌ చూశాక ఈ ఆలోచనలు మారాయి అని చెబుతున్నారు. అదేంటి అంచనాలు తగ్గాయా? పోస్టర్‌ అదిరిపోయింది కదా అంటారా?

అయ్యో… ఇక్కడ మేం చెబుతున్నది పోస్టర్‌లో కనిపించిన ప్రభాస్‌ (Prabhas) గురించి కాదు. పోస్టర్‌లో కనిపించని డేట్‌ గురించి. సినిమా పోస్టర్ అన్నాక అందులో హీరో, సినిమా పేరు, బ్యానర్‌ పేరు, దర్శకుడు (Nag Ashwin)  ఇతర సాంకేతిక నిపుణుల పేర్లు పక్కాగా ఉంటాయి. వాటితోపాటు రిలీజ్‌ డేట్‌ కూడా కచ్చితంగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా మనం ఈ స్టైల్‌ చూస్తూ ఉన్నాం. అంతెందుకు మొన్నీమధ్య వరకు ‘కల్కి 2898 ఏడీ’ పోస్టర్‌ల మీద కూడా చూశాం. అయితే శివరాత్రి సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో అది మిస్‌ అయ్యింది.

‘దీంతో ఒక్కటి మిస్‌ అయ్యింది భైరవ!’ అంటూ డార్లింగ్‌ ఫ్యాన్స్‌ క్వశ్చన్‌ రైజ్‌ చేస్తున్నారు. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా సినీ ప్రియుల కోసం చాలా కానుక‌లు వ‌చ్చాయి. అందులో ఎక్కువ‌గా ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన కానుక ‘కల్కి’ పోస్టరే. ప్రభాస్‌ లుక్‌, పోస్టర్‌ అదిరిపోయాయి. అయితే పోస్ట‌ర్ మీద రిలీజ్ డేట్ లేక‌పోవ‌డ‌మే సందేహాల‌కు తావిస్తోంది. ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చాన్నాళ్ల ముందే ప్ర‌క‌టించారు. అయితే మ‌ధ్య‌లో వాయిదా వార్త‌లు జోరుగా వినిపించాయి.

అయితే సినిమా టీమ్‌ మాత్రం మే 9కే వ‌స్తామ‌ని చెబుతూ వచ్చింది. రిలీజ్ డేట్ విష‌యంలో అంత ధీమాగా ఉన్న టీమ్‌… కొత్త పోస్ట‌ర్ మీద మే 9న విడుద‌ల అని ఎందుకు వేయ‌లేదు అనేదే ప్రశ్న. దీంతో సినిమా ఆ టైమ్‌కి రాదా అనే ప్రశ్న వినిపిస్తోంది. మరి టీమ్‌ ఈ విషయంలో ఏమన్నా స్పందిస్తుందేమో చూడాలి.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus