Bheemla Nayak Movie: సంక్రాంతి మిస్టరీకి క్లారిటీ ఇచ్చేదెవరు..!

‘అఖండ’ విడుదలైపోయింది కాబట్టి… టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్‌ అవైటెడ్‌ సినిమాలు అంటే నాలుగే అని చెప్పాలి. ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘భీమ్లా నాయక్‌’, ‘రాధే శ్యామ్‌’. ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చంతా వీటి గురించే నడుస్తోంది. అయితే వీటిలో ‘భీమ్లా నాయక్‌’ గురించి మాత్రం విచిత్రమైన చర్చ నడుస్తోంది. అదే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుంది అని. చిత్రబృందం, నిర్మాత ఎన్నిసార్లు విడుదల మీద స్పందించినా పుకార్లు మాత్రం ఆగడం లేదు.

నిర్మాత నాగవంశీ ఇటీవల కూడా పవన్‌ కల్యాణ్‌తో సెట్స్‌లో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ… సినిమా విడుదల తేదీ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. అసలు ఇన్నిసార్లు సినిమా విడుదల గురించి ఎందుకు క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది అనేది ఇక్కడ ప్రశ్న. సినిమా షూటింగ్‌ పూర్తవ్వలేదని, రీషూట్లు అని, డౌట్‌ అని ఇలా ఏదో ఒకటి చర్చకు తెస్తూనే ఉన్నారు. సంక్రాంతికి సందర్భంగా మూడు సినిమాలు విడుదల అవుతుంటే కేవలం ఒక్క ‘భీమ్లా నాయక్‌’ గురించే ఎందుకు అనేదే నెటిజన్ల ప్రశ్న.

నిజానికి సంక్రాంతి రిలీజ్‌ డేట్లు ప్రకటించిన తొలి సినిమాల్లో ‘భీమ్లా నాయక్‌’ ఒకటి. పొంగల్‌ సీజన్‌లో ఫస్ట్‌ వస్తున్న సినిమా కూడా ఇదే అవ్వాలి. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ అనుకోని విధంగా నిర్ణయం తీసుకొని జనవరి 7న వచ్చేస్తాం అని ప్రకటించింది. అప్పటి నుండి మిగిలిన సినిమాల వాయిదా కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ‘సర్కారు వారి పాట’ను ఏప్రిల్‌ 1కి వాయిదా వేశారు కూడా. బాలీవుడ్‌లో ‘గంగూభాయి’ని కూడా వాయిదా వేయించారు.

కానీ ఇక్కడ ‘భీమ్లా నాయక్‌’ విషయంలో మాత్రం ఇలాంటి ప్రయత్నాలు సాగలేదు అని టాలీవుడ్‌ వర్గాల టాక్‌. అయితే ఈ ప్రయత్నం ‘రాధే శ్యామ్‌’ విషయంలో ఎందుకు జరగలేదు అనేది మాత్రం తెలియడం లేదు. కేవలం ‘భీమ్లా నాయక్‌’ను మాత్రమే ఎందుకు వాయిదా వేయించాలని చూస్తున్నారో తెలియదు. ఇక పుకార్ల సంగతి కూడా ఇంతే.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus