కొంతమందికి ఎన్ని ఫ్లాప్‌లు వచ్చినా.. కొత్త సినిమా తీసుకొస్తున్నారు అనగా ఆ బజ్ క్రియేట్ అయిపోతుంది. ఎందకంటే ఏం జరిగినా ఆయన కొత్తదనంతో సినిమా తెస్తారు. ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ ఇస్తారు అనే నమ్మకమే. అలాంటి వారిలో దర్శకులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు పూరి జగన్నాథ్. ఆయన సినిమాలు, ఇతరుల సినిమాలు చాలా డిఫరెంట్ అని ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే సగటు సినిమా ప్రేక్షకులు ఊహించని కథ, కథనం, మాటలు ఆయన దగ్గర ఉంటాయి.
అయితే ఇప్పుడు ఆయన కామ్‌గా ఉండటం ప్రేక్షకులకు నచ్చడం లేదు. కరోనా టైమ్‌లో పూరి జగన్నాథ్ ‘మ్యూజింగ్స్’ పేరుతో కొన్ని పాడ్‌కాస్ట్‌లు చేశారు. ఆ తర్వాత వాటిని యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టారు. దాంట్లో ఆయన థియరీ ఉంటుంది. జీవితాన్ని, మనుషుల్ని, మనల్ని మనం ఎలా చూసుకోవాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. దానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా పూరి మ్యూజింగ్ అంటూ వెయిట్ చేస్తుంటారు.
అయితే సినిమాలు లేకుండా ఓన్లీ మ్యూజింగ్స్ చేసుకోవడం ఆయన ఫ్యాన్స్‌కి నచ్చడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ మేరకు కామెంట్స్ కనిపిస్తున్నాయి. నిజానికి పూరి జగన్నాథ్ ఖాళీగా ఏం లేరు. ఓవైపు చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ కోసం ఓ కాన్సెప్ట్ అనుకున్నారు. ఇవేవీ కాకుండా ఓ యువ హీరో కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నారు అని చెబుతున్నారు. అయితే ఇవేవీ ఫైనల్ కాకపోవడమే ఫ్యాన్స్‌కి నచ్చడం లేదు.
ఆయన లాంటి డైరక్టర్ కామ్‌గా ఉంటే ఇండస్ట్రీ డల్‌గా ఉంటుంది అనేది వారి ఆలోచన. మరి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని పూరికి ఈ మాటలు ఎవరు చెబుతారో, ఆయనను ఎవరు స్పీడప్ చేస్తారో చూడాలి. ఎందుకంటే పూరి సినిమా వస్తే.. ఆ మజానే వేరు. అది హిట్ అయితే ఆ హుషారే వేరు.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్